బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా గత శుక్రవారం చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అయితే ఈ హింసను వ్యతిరేకిస్తూ ఢిల్లీ వీహెచ్ పీ, భజరంగ్ దళ్ గురువారం నిరసన తెలిపాయి. 

గ‌త శుక్ర‌వారం దేశ వ్యాప్తంగా చెల‌రేగిన హింసాకాండ‌ను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ (VHP), దాని 
యువజన విభాగం అయిన బజరంగ్ దళ్ గురువారం ఢిల్లీలో ప్ర‌ద‌ర్శన నిర్వ‌హించాయి. నంద్ నగ్రి SDM కార్యాలయం వెలుపల నిర‌స‌న కారులు ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ వంటి నినాదాలు చేశారు. హిందువులపై దాడులను సహించేది లేదని ప్రతిజ్ఞ చేశారు.

జూన్ 10వ తేదీన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇస్లామిక్ జిహాదీ ఛాందసవాదుల ద్వారా పెరుగుతున్న తీవ్రవాద సంఘటనలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలోని దాదాపు 10 సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) కార్యాలయాల వ‌ద్ద ప్రదర్శనలు నిర్వ‌హించామ‌ని తెలిపారు. ‘‘ గత వారం భారతదేశం అంతటా నిరసనలకు వ్యతిరేకంగా మేము ఇక్కడ సమావేశమయ్యాము. ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన వారిపై కఠినంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాము ’’ అని ఢిల్లీ VHP అధ్యక్షుడు సురేంద్ర గుప్తా అన్నారు.

లగ్జరీ హోటల్‌లో మహిళపై రేప్.. డాన్ దావూద్ ఇబ్రహిం పేరిట బెదిరింపులు.. ‘ఎవరికి చెప్పినా చస్తావ్’ వార్నింగ్

అయితే బీజేపీ మాజీ అధికార ప్ర‌తినిధి వీహెచ్ పీ మ‌ద్ద‌తు ఇస్తుందా అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు సురేంద్ర గుప్తా స‌మాధానం ఇస్తూ.. ‘‘నేను ఆ విష‌యంపై మాట్లాడాల‌నుకోవ‌డం లేదు. మేము గ‌త వారం జ‌రిగిన హింస‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ మాత్ర‌మే ఇక్క‌కు వ‌చ్చాం’’ అని ఆయ‌న అన్నారు. కాగా కొన్ని రోజుల కింద‌ట జ్ఞాన్ వ్యాపి మ‌సీదు, శివలింగం అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్ లో బీజేపీ మాజీ అధికార ప్ర‌తినిధ‌ఙ నూపుర్ శ‌ర్మ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముస్లింల అరాధ్యుడైన మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై ఆమె అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని కాన్పూర్ లో రెండు వ‌ర్గాల మ‌ధ్య హింసాత్మ‌క ఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి. ప్ర‌యాగ్ రాజ్ తో పాటు మ‌రి కొన్ని ప‌ట్ణ‌ణాల్లో ఆందోళ‌న‌లు జ‌రిగాయి. ప‌శ్చిమ బెంగాల్ లోని హౌరా చేప‌ట్టిన నిర‌స‌న‌లు కూడా హింసాత్మ‌కంగా మారాయి. కాగా దేశంలో నూపుర్ శ‌ర్మ‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌నలు చేస్తున్న‌ట్టుగానే.. ఆమెకు మ‌ద్ద‌తుగా కూడా ర్యాలీలు తీస్తున్నారు. 

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తకు విషం పెట్టి చంపిన భార్య..

నూపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ యూపీలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌కు పాల్పడిన వారి ఆస్తుల‌ను యోగీ స‌ర్కార్ కూల్చివేస్తోంది. నిబంధ‌న‌లకు విరుద్ధంగా నిందితులు ఇళ్ల‌ను నిర్మించార‌ని పేర్కొంటూ వాటిని బుల్డోజింగ్ చేస్తోంది. ఈ చ‌ర్య‌లు ప‌లువురు నాయ‌కులు స‌మ‌ర్థించారు. మ‌రి కొంద‌రు నాయ‌కులు వ్య‌తిరేకించారు. బీజేపీ ఎంపీ సాక్షి మ‌హారాజ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. శుక్రవారం నిర‌స‌నకారులు రాళ్లు రువ్వితే వారికి పైకి శ‌నివారం బుల్డోజర్లు బ‌య‌లుదేరుతాయ‌ని అన్నారు. దేశవ్యాప్తంగా గత శుక్రవారం విస్తృత నిరసనలు జ‌రిగాయ‌ని, వాటిలో కొన్ని హింసాత్మకంగా ఉన్నాయని ఆయ‌న తెలిపారు. 

‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’..నేను రాష్ట్రపతి అభ్యర్థిని కాదు.. కేఏ పాల్

యూపీ ప్ర‌తిప‌క్షనేత, స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ ప్ర‌భుత్వ చ‌ర్య‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇళ్ల‌ను కూల్చ‌డం సరైంది కాద‌ని అన్నారు. ప్ర‌యాగ్ రాజ్ లో హింస‌కు పాల్పిడిన జూవైద్ పేరుపై ఇళ్లు లేకున్నా దానిని కూల్చ‌డం అన్యాయ‌ని అన్నారు. రాజ‌స్థాన్ సీఎం మాట్లాడుతూ.. ఒక‌రు ఇళ్లును కూలుస్తున్నార‌ని మిగితా ప్ర‌జ‌లెవ‌రూ సంతోష ప‌డ‌కూడ‌ద‌ని, ఆ బుల్డోజ‌ర్లు అంద‌రి ఇళ్ల‌వైపు వ‌స్తాయ‌ని తెలిపారు.