వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తకు అన్నంతో విషం కలిసి పెట్టిందో భార్య. ఆ తరువాత ప్రియుడితో పారిపోవాలని ప్లాన్ వేసింది. కానీ పోలీసులకు తెలియడంతో...
చెన్నై : సేలం జిల్లా కొళత్తూరు, వీరభద్రన్ కోట్టైలో Illicit affairకి అడ్డుగా ఉన్న భర్తను అన్నంలో విషం పెట్టి భార్య చంపేసింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని వీరభద్రన్ కోట్టై గ్రామానికి చెందిన శక్తివేల్ (37) రోజు కూలీగా జీవితం గడుపుతున్నాడు. ఈయన భార్య పుగళరసి (27)కి ముత్తుకుమార్ అనే వ్యక్తితో Extramarital affair ఏర్పడింది. ఈ విషయం శక్తివేల్ కు తెలిసి భార్యను పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తన మార్చుకోకపోగా భర్త అడ్డు తొలగించుకునేందుకు తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.
తన భర్తకు మద్యం అలవాటు ఉండడంతో పీకల వరకు తాగించి, అన్నంతో విషం పెట్టింది. మద్యం మత్తులో విషం కలిపిన ఆహారాన్ని తిన్న శక్తివేల్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా అసలు విషయం వెల్లడయ్యింది. దీంతో పుగళరసి, ముత్తుకుమార్ లను అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా, బీహార్లోని చంపారణ్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ నవ వధువు తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పారిపోయింది. భగవాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజయాబ్‌గంజ్ స్థానిక ఒకటో వార్డు లోఘోరం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంతోష్ దాస్ (29) అనే యువకుడికి గోపాల్గంజ్ జిల్లాకు చెందిన సిమ్రాన్ కుమార్ (23)కి వివాహం జరిగింది. తావే ఆలయంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. కొన్ని రోజులపాటు అందరూ బాగానే ఉన్నారు.
అయితే సిమ్రాన్ ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతుండడంతో భర్తకు అనుమానం వచ్చింది. వేరొక వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానించాడు. ఆమె వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లాక్కొని.. బేసిక్ ఫోన్ ఇచ్చాడు. ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఐతే మంగళవారం ఇంట్లో సంతోష్ తప్ప ఎవరూ లేవరు. అందరూ ఇరుగుపొరుగు వారికి పెళ్లికి వెళ్లారు. అదే సమయంలో సిమ్రాన్ ఓ యువకుడిని ఇంటిని పిలిచింది. తమ బంధువని భర్తకు పరిచయం చేసింది. సిమ్రాన్ నిత్యం తరచూ ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుండడం.. బంధువని చెప్పి ఓ యువకుడిని ఇంటికి పిలవడంతో భర్తకు అనుమానం పెరిగింది.ఆమెను నిలదాద్దీమనుకునేలోపే ఘోరం జరిగింది. సిమ్రాన్, ఆ యువకుడు కలిసి.. సంతోష్ ను చంపేశారు. ఆ తరువాత ఫ్యాన్ కు వేలాడదీసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆ తరువాత ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులను తీసుకుని.. ఇంటికి తాళం వేసి పారిపోయింది. మరుసటి రోజు ఉదయం కుటుంబసభ్యులంతా ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది. సంతోష్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. సిమ్రాన్ ఫోన్ స్విచాఫ్ వస్తుంది. ఏదో జరిగిందని వారిలో అనుమానం కలిగింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఫ్యాన్కు వేలాడుతూ సంతోష్ శవం కనిపించింది.
అందరూ షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులంతా సిమ్రాన్ పైనే అనుమానం వ్యక్తం చేశారు. సిమ్రాన్ ఇంటికి తాళం వేసి వెళుతుండగా కొందరు స్థానికులు చూశారు. అందువల్లే ఆమె హత్య చేసిందని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన నెల రోజులకే భర్తను హత్య చేసిన ఘటన వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది.
