ఇండిపెండెన్స్ డే వేడుకల్లో మోడీ ప్రసంగం: ప్రముఖుల ప్రశంసలు
77వ ఇండిపెండెన్స్ డే వేడుకలను పురస్కరించుకొని ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసించారు.ఈ మేరకు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని మంగళవారంనాడు ఎర్రకోట నుండి చేసిన ప్రసంగంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.పద్మ అవార్డు గ్రహీతలు, విద్యావేత్తలు, వ్యాపార ధిగ్గజాలు ,సినీ నటులు, క్రీడాకారులు మోడీ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.ఎఫ్ఐఎస్ఎంఈ సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ ట్విట్టర్ వేదికగా మోడీ ప్రసంగంపై స్పందించారు. తన ప్రసంగంలో మోడీ ప్రస్తావించిన డెమోక్రసీ, డెమోగ్రపీ, డైవర్శిటీ ల గురించి ఆయన స్పందించారు.
జాతీయ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం ఛైర్మెన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుధే మోడీ ప్రసంగంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రపంచ చాంపియన్, అర్జున అవార్డు గ్రహీత భారత ఆర్చర్ అభిషేక్ వర్మ మోడీ ప్రసంగంపై స్పందించారు. మోడీ అవినీతి వ్యతిరేక నినాదానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని ఆయన కోరారు.
అంతర్జాతీయ పతక విజేత గౌరవ్ రాణా మోడీ సందేశంపై ప్రశంసలు కురిపించారు.రాష్ట్ర ప్రథంపై మాట్లాడారు. అంతర్జాతీయ స్పోర్ట్స్ మెడలిస్ట్ నిహల్ సింగ్ కూడ రాష్ట్ర ప్రథం గురించి స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇదే ఆలోచనలతో తాము జీవిస్తున్నామన్నారు.అంతర్జాతీయ పతక విజేత ఫెన్సర్ జాస్మిన్ కౌర్ రాష్ట్ర ప్రథం గురించి మాట్లాడారు. ప్రస్తుత జీవితానికి ఇదే నినాదంగా ఆమె పేర్కొన్నారు.రైతులకు ప్రధాని తన ప్రసంగంలో ఇచ్చిన గుర్తింపును పద్మశ్రీ భరత్ భూషన్ త్యాగి ప్రస్తావించారు.
పద్మభూషన్ అవార్డు గ్రహీత, గాయని కేఎస్ చిత్ర స్పందించారు. మహిళా సాధికారిత గురించి ప్రధాని ప్రస్తావించిన అంశాలను ప్రస్తావించారు.ఈ కార్యక్రమాలు తనకు సంతోషాన్ని కల్గించినట్టుగా చెప్పారు.ప్రపంచంలోనే అత్యధికంగా కమర్షియల్ మహిళా పైలెట్లు ఇండియాలోనే ఉన్నారనే మోడీ ప్రకటనను ఆమె మహిళా పైలెట్ కెప్టెన్ జోయా అగర్వాల్ ప్రస్తావించారు. అన్ని రంగాలతో పాటు విమానరంగంలో కూడ మహిళల అభివృద్దిని ప్రోత్సహిస్తుందన్నారు.ప్రధాని మోడీ గత 9 ఏళ్ల కాలంలో తీసుకు వచ్చిన సంస్కరణలను ఐఐటీఈ గాంధీనగర్ వైస్ ఛాన్సలర్ హర్షద్ పటేల్ ప్రస్తావించారు.