విమానంలో యువ మహిళా డాక్టర్ పై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. పక్కనే కూర్చొని, అనుచితంగా తాకుతూ..
ఓ విమానంలో ప్రొఫెసర్ తోటి మహిళా ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడు. పక్కన కూర్చున్న ఆమెను అనుచితంగా తాకాడు. దీంతో విమానం ల్యాండ్ అయిన తరువాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు.

ఆయనో ప్రొఫెసర్. వయస్సు 47 సంవత్సరాలు. విద్యా బుద్దులు నేర్పుతూ, సమాజంలో ఎలా నడుచుకోవాలో చెప్పాల్సిన వృత్తిలో ఉన్న ఆయనే..వంకరగా ఆలోచించాడు. కామంతో ఓ యువ డాక్టర్ ను అనుచితంగా తాకాడు. ఈ ఘటన ఓ విమాన ప్రయాణంలో చోటు చేసుకోగా.. ల్యాండ్ అయిన వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 5.30 నిమిషాలకు ఢిల్లీ నుంచి ముంబాయికి ఓ విమానం బయలుదేరింది. అందులో 24 ఏళ్ల మహిళా డాక్టర్ ప్రయాణిస్తోంది. ఆమె పక్కన సీటులో 47 ఏళ్ల ప్రొఫెసర్ కూర్చున్నాడు. విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందు ఆ మహిళా డాక్టర్ ను ప్రొఫెసర్ అనుచితంగా తాకాడు.
దీంతో బాధితురాలు అతడిని ఇదేంటని ప్రశ్నించింది. ప్రొఫెసర్ కు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయంలో బాధితురాలు విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది ఈ ఇద్దరి వాగ్వాదంలో కలుగజేసుకున్నారు. కొంత సమయం తరువాత విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. వెంటనే మహిళా డాక్టర్ సహర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
మణిపూర్ లో కొనసాగుతున్న హింసాకాండ.. మరో నలుగురు పోలీసులను గాయపర్చిన దుండగులు
తనకు విమానంలో ఎదురైన అనుభవాన్ని పోలీసులకు వివరించారు. ఆ ప్రొఫెసర్ పై ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రొఫెసర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. తరువాత అతడిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇటీవల కాలంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా విమానాల్లో అభ్యంతరకర ప్రవర్తన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో కూడా ఇలాంటి ఒకటి జరిగింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తనకు నచ్చిన ఆహారం అందించలేదని సిబ్బందిపై మండిపడ్డాడు. దీంతో ఓ ఎయిర్ హోస్టెస్ అక్కడికి వచ్చి ఏం జరిగిందని ఆరా తీసింది.
దీంతో చికెన్ తో చేసిన వంటకాలు తీసుకొస్తానని, కానీ దానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆమె చెప్పడంతో ప్రయాణికుడు అంగీకరించాడు. కొంత సమయం తరువాత అతడి నుంచి నగదు తీసుకునేందుకు ఎయిర్ హోస్టెస్ స్వైపింగ్ మెషిన్ తీసుకొచ్చింది. అయితే కార్డ్ స్వైప్ చేసే వంకతో ఆమెను ఆ ప్రయాణికుడు అనుచితంగా తాకాడు. దీనిని ఆమె ప్రతిఘటించగా.. నిందితుడు సీటులోంచి లేచి మరింత రెచ్చిపోయాడు. అతనిని ఆపేందుకు ప్రయత్నించిన ఇతర సిబ్బందిని, తోటి సిబ్బందిపైనా దాడి చేశాడు. అనంతరం విమానం ముంబైలో ల్యాండ్ అవ్వగానే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతడి కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.