మణిపూర్ లో కొనసాగుతున్న హింసాకాండ.. మరో నలుగురు పోలీసులను గాయపర్చిన దుండగులు
మణిపూర్ లో జాతి హింస కొనసాగుతోంది. గురువారం సాయుధ గుంపు పోలీసులపైనే దాడి చేసింది. దీంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరు రాష్ట్ర స్థాయి అధికారి ఉన్నారు. ప్రస్తుతం వారంతా ఇంఫాల్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
మణిపూర్ లో హింసాకాండ కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణలో అమాయకమైన పౌరులు మరణిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలకు కూడా గాయాలు అవుతున్నాయి. తాజాగా బిష్ణుపూర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. జిల్లాలోని ఫూగక్చావో ఇఖై పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫూగక్చావో ఇఖై అవాంగ్ లీకై, తేరాఖోంగ్సాంగ్బి ప్రాంతాల్లో గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలపై అనుమానిత సాయుధ దుండగులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు కూడా కాల్పులు మొదలు పెట్టారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్ పదవీకాలాన్ని పొడిగించిన సుప్రీంకోర్టు.. ఎప్పటి వరకు అంటే ?
ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. వారిలో ఒకరు రాష్ట్ర స్థాయి పోలీసు అధికారి ఉన్నారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. క్షతగాత్రులను బిష్ణుపూర్ జిల్లా ఆసుపత్రి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఇంఫాల్ లోని మరో హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా.. ఇంఫాల్ కు దక్షిణంగా 110 కిలోమీటర్ల దూరంలో, ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సరిహద్దు పట్టణమైన మోరేలో ఓ గుంపు బుధవారం దాదాపు 16 పాడుబడిన ఇళ్లకు నిప్పు పెట్టింది. దీంతో పాటు అటవీ అతిథి గృహాన్ని పాక్షికంగా తగలబెట్టింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని అల్లరి మూకలను చెదరగొట్టారు.
భార్యను హతమార్చి.. రెండేళ్ల కూతురును రైలు పట్టాలపై పడుకోబెట్టి.. దారుణం
అలాగే హీకోల్, ఫూగక్చావో ఇఖై ప్రాంతాల్లో మంగళవారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ విద్యార్థి సహా ముగ్గురు పౌరులు గాయపడ్డారు. భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయని, దుండగులను తిప్పికొట్టాయని మణిపూర్ పోలీసులు బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కాంగ్పోక్పీ ప్రాంతంలో భద్రతా సిబ్బందిని తీసుకెళ్తున్న రెండు బస్సులకు ఓ గుంపు నిప్పుపెట్టింది. ఈ ఘటనకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సిరియాలో బాంబు పేలుడు.. ఆరుగురు మృతి, 23 మందికి గాయాలు
మే మొదటి వారం నుండి మణిపూర్ లో మెయిటీ, కుకి తెగల మధ్య జాతి హింస కొనసాగుతోంది. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50,000 మందికి ప్రజలు నిర్వాసితులయ్యారు. 142 మంది మరణించారు. అనేక ఇళ్లు, గ్రామాలు దహనం అయ్యాయి.