సభలో బలముందని భావిస్తే బిల్లులను ఓడించండి.. కానీ అవిశ్వాస తీర్మానమెందుకు - కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
పార్లమెంట్ లో సంఖ్యా బలం ఉంటే బిల్లులు పాస్ కాకుండా చూసుకోవాలని, అంతే గానీ సభలో ప్రభుత్వ కార్యకలాపాలు సాగకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఎందుకని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యకలాపాలు జరగకూడదని విపక్షాలు భావిస్తున్నాయా అని అన్నారు.

లోక్ సభలో సంఖ్యాబలం ఉందని భావిస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను సభలో ఓడించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెండింగ్ లో ఉన్న సమయంలో ప్రభుత్వం శాసనసభా వ్యవహారాలు చేపట్టడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో జోషి ఈ విధంగా ఘాటుగా స్పందించారు.
మణిపూర్ లో కొనసాగుతున్న హింసాకాండ.. మరో నలుగురు పోలీసులను గాయపర్చిన దుండగులు
పార్లమెంటు వెలుపల శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అకస్మాత్తుగా అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయని అన్నారు. అంటే ప్రభుత్వ కార్యకలాపాలు జరగకూడదా అని ప్రశ్నించారు. సంఖ్యా బలం ఉందని భావిస్తే బిల్లులను సభలోనే ఓడించాలని మంత్రి అన్నారు.
అల్లర్లతో అతలాకుతలమైన మణిపూర్ ను ప్రతిపక్ష ఎంపీలు సందర్శించాలనే నిర్ణయంపై వ్యాఖ్యానించాలని మీడియా ఆయనను అడిగినప్పుడు.. ‘‘వాళ్ళని వదిలేయండి. గ్రౌండ్ జీరో రిపోర్ట్ ఏమిటి? వారు చర్చకు అనుమతిస్తే అన్నింటిని సభలో ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వారు చర్చించాలనుకుంటే, నిజం బయటకు రావాలంటే, పార్లమెంట్ ను మించిన మంచి ప్రదేశం లేదు’’ అని జోషి అన్నారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్ పదవీకాలాన్ని పొడిగించిన సుప్రీంకోర్టు.. ఎప్పటి వరకు అంటే ?
కాగా.. మణిపూర్ అంశంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాల కూటమి కేంద్ర ప్రభుత్వంపై రెండు రోజుల కిందట అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్ అందించిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ అనుమతించారు. దానిపై ఇంకా లోకసభలో చర్చ జరగలేదు. అయితే లోక్ సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన ప్రక్రియ పెండింగ్ లో ఉన్న సమయంలో విధానపరమైన అంశాలకు సంబంధించిన శాసనసభ వ్యవహారాలను ప్రభుత్వం ముందుకు తీసుకురావడం హాస్యాస్పదమని, చిత్తశుద్ధి, ఔచిత్యానికి విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శించాయి.
ఎంఎన్ కౌల్, ఎస్ ఎల్ శక్దేర్ పార్లమెంట్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ను ఉదహరిస్తూ ఆర్ఎస్ పీ సభ్యుడు ఎన్ కే ప్రేమచంద్రన్ మాట్లాడుతూ.. ‘‘ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సభకు సెలవు ఇచ్చినప్పుడు, అది పరిష్కారమయ్యే వరకు విధానపరమైన విషయాలపై ప్రభుత్వం ఎలాంటి గణనీయమైన తీర్మానాన్ని సభ ముందుకు తీసుకురావాల్సిన అవసరం లేదు.’’ అని అన్నారు.
అమెరికాలో కోలుకుంటున్న భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య.. ఇంతకీ ఆమెకు ఏమైందంటే ?
కాగా.. కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం ఆమోదించి, సభలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను సంప్రదించిన తర్వాత దీనిపై చర్చకు తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. జూలై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ లో జాతి హింస అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో పలుమార్లు అంతరాయాలు ఏర్పడ్డాయి.