Asianet News TeluguAsianet News Telugu

Priyanka Gandhi: ప్రియాంక మరో హామీ.. అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు నెలకు రూ. 10 వేలు..

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi).. ఆశా వర్కర్లకు (ASHA Workers) వేతనం విషయంలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు.

Priyanka Gandhi Vows rs 10000 Monthly For ASHA Workers If Congress came in power
Author
Lucknow, First Published Nov 10, 2021, 5:12 PM IST

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi).. ఆశా వర్కర్లకు (ASHA Workers) వేతనం విషయంలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. గౌరవ వేతనం పొందడం ఆశా కార్యకర్తల హక్కు అని, తమ పార్టీ ఈ హామీకి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆశా వర్కర్లు చేసిన సేలవను అమమానించిందని ఆరోపించారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రియాంక గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. 

అంతేకాకుండా ఈ క్రమంలోనే ప్రియంక గాంధీ ప్రజలను తమ వైపు ఆకర్షించడానికి హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తమ డిమాండ్లతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవాలని అనుకున్న ఆశా వర్కర్లపై షాజహాన్‌పూర్‌లో పోలీసులు దాడి చేసిట్లు ఆరోపించిన వీడియోను ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

Also read: రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటే తొలి నిర్ణయం ఇదే..! రాహుల్ సమాధానమిదే

‘ఆశా సోదరీమణులపై యూపీ ప్రభుత్వం చేసిన ప్రతి దాడి వారు చేసిన పనిని అవమానించడమే. ఆశా సోదరీమణులు కరోనా వైరస్ విజృంభించిన సమయంలో,  ఇతర సందర్భాలలో గొప్ప సేవలను అందించారు. గౌరవ వేతనం పొందడం అనేది వారి హక్కు. వారికి గౌరవ వేతనం కల్పించడం ప్రభుత్వ విధి. ప్రభుత్వం వాటిని వినాలి’ అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఆశా సోదరీమణులు గౌరవ వేతనం పొందడానికి అర్హులు.. ఈ పోరాటంలో తాను వారితో ఉన్నానని ఆమె పేర్కొన్నారు. 
ఆశా సోదరీమణులకు గౌరవ వేతనం పొందడం హక్కు.. తమ ప్రభుత్వం ఏర్పాటైతే అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ. 10 వేలు గౌరవ వేతనం అందజేస్తామని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో గోశాలలు చాలా పేలవంగా ఉన్నాయని ఆరోపించిన ప్రియాంక గాంధీ.. యూపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. 

 

ఇక, గతంలో ప్రియాంక మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోధమ, వరి పంటలు క్వింటాల్‌కు రూ. 2,500, క్వింటాల్ చెరకుకు రూ. 400ల చొప్పున కొనుగోలు చేస్తామని అన్నారు. తమ పార్టీకి ఓటు వేసిగెలిపిస్తే.. ప్రజలందరికీ రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios