Asianet News TeluguAsianet News Telugu

భారత్ జోడో యాత్ర ప్రభావంతో ప్రధాని ఇక ‘టోపీ’ ధరిస్తారు - కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ఇక కచ్చితంగా టోపీ ధరిస్తారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ యాత్ర వల్ల గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మసీదుకు వెళ్లారని గుర్తు చేశారు. 

Prime Minister will now wear a 'cap' due to Bharat Jodo Yatra - Congress leader Digvijay Singh
Author
First Published Nov 16, 2022, 11:54 AM IST

రాహుల్ గాంధీ నేతృత్వంలో  చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావం వల్ల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మదర్సా, మసీదును సందర్శించాల్సి వచ్చిందని, ఇక త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ‘టోపీ’ ధరించడం మొదలు పెడుతారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ అన్నారు. 

సౌదీ అరేబియా, ఇతర దేశాల్లో ముస్లింలు ధరించే టోపీని ప్రధాని మోడీ ధరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు చేశారు. యాత్ర ప్రారంభమైన రెండు నెలల్లోనే.. దేశంలోని పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, ధనికులు మరింత ధనవంతులు అవుతున్నారని సంఘ్‌కు చెందిన ఓ సీనియర్‌ నాయకుడు చెప్పాల్సి వచ్చిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ యాత్ర తన చివరి గమ్యస్థానమైన శ్రీనగర్‌కు చేరుకున్నప్పుడు ఏమి జరుగుతుందో అందరూ చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ పదవికి భారత్ కు చెందిన సౌమ్య స్వామినాథన్ రాజీనామా

షాడోల్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన ‘ట్రైబల్ ప్రైడ్ డే’ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకావడంపై సింగ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీకి చెందిన ప్రజల సంక్షేమం పేరుతో అధికార భారతీయ జనతా పార్టీ కేవలం జిమ్మిక్కులపై మాత్రమే ఆధారపడి ఉందని ఆరోపించారు. ‘‘ ద్రౌపది ముర్ము మన దేశానికి రాష్ట్రపతి అయినందుకు మేము గర్విస్తున్నాం. మధ్యప్రదేశ్ లో గిరిజనులపై జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఆమె మాట్లాడతారని మేము ఆశిస్తున్నాం. ఈ అంశంపై మాట్లాడడానికి ఆమె ఇష్టపడకపోతే, కనీసం దానిపై చర్చించడానికి మా ప్రతినిధి బృందానికి ఆమె కొంత సమయం ఇవ్వాలి ’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. గతంలో షెడ్యూల్డ్ కులానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్రపతి కోవింద్ హయాంలో దేశంలోని కోట్లాది మంది దళితులకు తమ ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలను అందించిందో ప్రధాని వివరించాలన్నారు.

కుక్క కరిచిన మహిళకు రూ. 2 లక్షల పరిహారం.. ఆ జాతుల కుక్కలపై నిషేధం..

 కాగా.. ఇటీవల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మసీదులు, మదర్సాలను సందర్శించడం మొదలు పెట్టారు. అయితే భారత్ జోడో యాత్ర చేపట్టిన నెల రోజుల వ్యవధిలోనే ఇది చోటు చేసుకుంది. దీంతో తమ యాత్ర ప్రభావం వల్ల బీజేపీ కూడా ముస్లింలకు దగ్గర అయ్యేందుకు ఇలా చేస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. 2011 సెప్టెంబరులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్‌లో సద్భావన నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు ఆయనకు టోపీ అందజేశారు. అయితే దానిని ధరించడానికి ప్రధాని నిరాకరించారు. దీనిని ఉద్దేశించే తాజాగా దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్.. తీవ్రమవుతున్న సమస్య.. కొత్త అధ్యయనాల ఏమంటున్నాయంటే..

భారత్ జోడో యాత్ర మొదలైన దాదాపు నెల రోజుల తరువాత బీజేపీ మాతృసంస్థగా భావించే ఆర్ఎస్ఎస్ కూడా ముస్లిం మత పెద్దలతో చర్చలు ప్రారంభించింది. అందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సెప్టెంబర్‌లో ఢిల్లీలోని మసీదు, మదర్సా (ఇస్లామిక్ సెమినరీ)ని సందర్శించారు. అందులో ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధినేత ఉమర్ అహ్మద్ ఇలియాసితో కలిసి చర్చలు జరిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios