Asianet News TeluguAsianet News Telugu

కుక్క కరిచిన మహిళకు రూ. 2 లక్షల పరిహారం.. ఆ జాతుల కుక్కలపై నిషేధం..

కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళకు వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక రూ.2లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు దాడికి పాల్పడిన కుక్క జాతులను నిషేధం విధించాలని పేర్కొంది. 

compensation to dog-bite victim and also foreign breeds banned In Gurugram
Author
First Published Nov 16, 2022, 10:00 AM IST

గురుగ్రామ్ : కుక్క దాడికి గురైన ఓ మహిళకు ఉపశమనం లభించింది. ఆగస్టు నెలలో గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళపై పెంపుడు కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ కేసులో గాయాలపాలైన మహిళకు రెండు లక్షల రూపాయల మధ్యంతర పరిహారం ఇవ్వాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ)ని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక మంగళవారం ఆదేశించింది. అయితే ఈ మొత్తాన్ని కుక్క యజమానిని నుంచి కూడా రికవరీ చేయవచ్చని ఎంసిజీని ఫోరమ్ ఆదేశించింది.

ఆగస్టు 11న స్థానికంగా ఇళ్లల్లో పనిచేసే మున్నీ అనే బాధితురాలు తన కోడలితో కలిసి పనికి వెళుతుండగా వినీత్ చీకారాకు చెందిన కుక్క దాడి చేసింది. ఆమె తల, ముఖంపై తీవ్రంగా దాడి చేసింది కుక్క. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే గురుగ్రామ్ లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సివిల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్.. తీవ్రమవుతున్న సమస్య.. కొత్త అధ్యయనాల ఏమంటున్నాయంటే..

అయితే దాడి చేసిన  కుక్క జాతిని ‘పిట్ బుల్’ అని ముందు పేర్కొన్నారు. అయితే, ఆ జాతి ‘డిగో అర్జెంటీనో’గా తర్వాత యజమాని సమాచారమిచ్చాడు. కస్టడీకి తీసుకోవడంతోపాటు లైసెన్స్లను రద్దు చేయాలని ఫోరం ఎంసిజీలను ఆదేశించింది. 11 విదేశీ జాతులను  నిషేధించాలని ఆదేశించింది. పెంపుడు కుక్కల కోసం మూడు నెలల్లో పాలసీలు రూపొందించాలని ఆదేశించింది. ‘డిగో అర్జెంటీనో’ జాతిని పెంపుడు కుక్కలా పెంచుకుంటున్న కుక్క యజమానిని చట్టాన్ని ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంసీజీ కావాలంటే కుక్క యజమానిని నుంచి రూ.2 లక్షలను వసూలు చేయవచ్చు అని పేర్కొంది. 

ఈ కేసులో బాధితురాలు తరఫున న్యాయవాది సందీప్ సైనీ వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం ఫిర్యాదు చేశారు. బాధితురాలికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. అమెరికన్ పిట్-బుల్ టెర్రియర్లు, డిగో అర్జెంటీనో, రోట్ వీలర్, నియాపోలిటన్ మాస్టిఫ్, బోర్ బోయెల్, ప్రెసా కానరియో, వోల్ఫ్ డాగ్, బాండోగ్, అమెరికన్ బుల్ డాగ్, ఫిలా బ్రసిలీరో, కేన్ కోర్సో  జాతుల కుక్కలని పూర్తిగా నిషేధించారు. ఈ జాతుల కుక్కలని ఎవరైనా పెంచుకుంటే వెంటనే ఆ కుక్క జాతులు కస్టడీలోకి తీసుకోవాలని ఫోరం ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios