Asianet News TeluguAsianet News Telugu

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ పదవికి భారత్ కు చెందిన సౌమ్య స్వామినాథన్ రాజీనామా

ప్రపంచ ఆరోగ్య సంస్థలో అత్యున్నత పదవిలో సౌమ్య స్వామినాథన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. 

Indias Soumya Swaminathan resigned from the post of WHO Chief Scientist
Author
First Published Nov 16, 2022, 10:05 AM IST

భారతదేశానికి చెందిన సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేధికగా ప్రకటించింది. అయితే ఆమె పదవీ విరమణ చేయడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ ఈ లోపే స్వామినాథన్ ఈ నిర్ణయం తీసుకుంది. 

కుక్క కరిచిన మహిళకు రూ. 2 లక్షల పరిహారం.. ఆ జాతుల కుక్కలపై నిషేధం..

ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. ఆమె రాజీనామాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇంకా కారణాలు వెల్లడించలేదు. అయితే ఆమె నిష్క్రమించాలని నిర్ణయించుకున్నారు. కోవిడ్ -19 మహమ్మారి తరువాత ప్రపంచం అంతా భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్న సమయంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఊహించిన ఉన్నత  స్థాయి ఉద్యోగుల నిష్క్రమణల శ్రేణిలో ఇది మొదటిది. మరి కొంత మంది ఉన్నత ఉద్యోగులు కూడా రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. 

అయితే స్వామినాథన్ తన పదవికి రాజీనామా చేసే ముందు మరింత ఆచరణాత్మకమైన పని చేయాలనే కోరికతో భారతదేశానికి తిరిగి రావాలని యోచిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios