ఉత్తరాఖండ్ పార్వతీ కుండ్ లో భద్రతా దళాలతో ప్రధాని సంభాషణ.. సైనికుల సేవలను కొనియాడిన మోడీ..
కిష్ట పరిస్థితుల్లోనూ సైనికుల సేవలు యావత్ దేశానికి స్ఫూర్తిదాయకం అని ప్రధాని మోడీ అన్నారు. గురవారం ఆయన ఉత్తరాఖండ్ లోని పార్వతీ కుండ్, గుంజి వద్ద భారత సైన్యం, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలను కలిశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా పార్వతీ కుండ్, గుంజి వద్ద భారత సైన్యం, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ బలగాలను గురువారం కలిశారు. వారితో సంభాషించారు. ఈ సందర్బంగా సైనికుల సేవలను ప్రధాని కొనియాడారు. ‘‘ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వారి అచంచల సేవ నిజంగా అభినందనీయం. వారి స్ఫూర్తి, అంకితభావం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకం’’ అని ప్రధాని మోడీ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.
గంగాజలంపై 18 శాతం జీఎస్టీ ఉందా ? క్లారిటీ ఇచ్చిన కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు
కాగా.. అంతకుముందు ఉత్తరాఖండ్ లో దాదాపు రూ.4,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఇందులో 21,398 పాలీహౌస్ లు, అధిక సాంద్రత కలిగిన ఆపిల్ తోటల పెంపకం, డబుల్ లేన్ రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారుల వాలు శుద్ధి, రాష్ట్రంలో 32 వంతెనల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. విపత్తు నిర్వహణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, విద్య, ఆరోగ్యం, క్రీడా సౌకర్యాల విస్తరణ, చార్ధామ్ తరహాలో మానస్ ఖండ్ ప్రాంతంలో దేవాలయాలను అభివృద్ధి చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, విద్యుత్, తాగునీరు, క్రీడలు, పర్యాటకం, విపత్తుల నివారణ, ఉద్యానవన రంగాలకు ఈ ప్రాజెక్టులు ఊతమివ్వనున్నాయి.
వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఇది ఉత్తరాఖండ్ దశాబ్దమని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కుతుందని, ఆ ఒక్క లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. దేశం నుంచి పేదరికాన్ని రూపుమాపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం ఐదేళ్లలో 13.5 కోట్ల మందిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చిందని ప్రధాని మోడీ తెలిపారు.
ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయల కోసం ‘ఆపరేషన్ అజయ్’.. నేడు బయలుదేరనున్న మొదటి విమానం..
కాగా.. ప్రధాని మోడీ అల్మోరాలోని జగేశ్వర్ ధామ్ ను ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు చేశారు. దాదాపు 6200 అడుగుల ఎత్తులో ఉన్న దేశంలోని అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఆయన పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఉన్నారు.