2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడు:గగన్ యాన్ మిషన్ పై మోడీ సమీక్ష
అంతరిక్ష ప్రయోగంలో భారత శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాల్లో ముందడగు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. గగన్ యాన్ మిషన్ పై మోడీ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
న్యూఢిల్లీ:వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్ తో కూడిన ఇంటర్ ప్లానెటటరీ మిషన్ ల కోసం కృషి చేయాలని ప్రధాని మోడీ భారతీయ శాస్త్రవేత్తలకు సూచించారు.గగన్ యాన్ మిషన్ పై అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారంనాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భారతదేశ గగన్ యాన్ మిషన్ పురోగతిని అంచనా వేయడానికి అధికారులతో , శాస్త్రవేత్తలతో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ సమీక్ష నిర్వహించారు.మానవ రేటేడ్ ప్రయోగ వాహనాలతో పాటు 20 ప్రధాన పరీక్షల గురించి చర్చించారు. క్రూ ఏస్కేప్ సిస్టం టెస్ట్ వెహికల్ ప్రదర్శనను ఈ నెల 21న షెడ్యూల్ చేశారు.2025 లో గగన్ యాన్ ప్రయోగం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల నిర్వహించిన చంద్రయాన్, ఆదిత్య ఎల్ 1 భారత అంతరిక్ష కార్యక్రమాలు విజయవంతమైన నేథ్యంలో భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటుతో సహా ప్రతిష్టాత్మక లక్ష్యాలను పెట్టుకోవాలని ప్రధాని ఆదేశించారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు కావాలని ప్రధాని సూచించారు. 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపాలనే లక్ష్యాన్ని ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు సూచించారు.
చంద్రుడిపై అన్వేషణ కోసం రోడ్ మ్యాప్ కోసం అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకున్నారు.చంద్రయాన్ మిషన్ల శ్రేణిని, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అభివృద్ధి, కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణం, మానవ కేంద్రీకృత ప్రయోగశాలల ఏర్పాటుపై కేంద్రీకరించనున్నారు.భారతదేశ సామర్థ్యాలపై ప్రధాని మోదీ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.