Uttarakhand: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ఉత్తరాఖండ్ లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతకుముందు మే 18న పూరీ-హౌరా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.
PM Modi To Flag Off Uttarakhand's First Vande Bharat Express: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ఉత్తరాఖండ్ లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతకుముందు మే 18న పూరీ-హౌరా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరాఖండ్ తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ రైలు డెహ్రాడూన్- న్యూఢిల్లీ మధ్య నడుస్తుందని మొరాదాబాద్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (డీసీఎం) సుధీర్ సింగ్ తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ లో రాష్ట్ర తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. అంతకుముందు మే 18న పూరీ-హౌరా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన ప్రయాణాన్ని కల్పిస్తుంది. అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైలులో అత్యాధునికమైన ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. ఒడిశా మొదటి వందే భారత్ రైలును ప్రారంభించిన తర్వాత, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఈ ఏడాది జూన్ నాటికి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు దాదాపు అన్ని రాష్ట్రాలకు చేరాలని ప్రధాని మోడీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని చెప్పారు. "జూన్ నాటికి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు దాదాపు అన్ని రాష్ట్రాలకు చేరాలని ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. వందే మెట్రోను 100 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం, ప్రయాణికుల రోజువారీ ప్రయాణానికి డిజైన్ చేస్తున్నాం" అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ అనేది దేశీయంగా తయారైన, సెమీ హైస్పీడ్, సెల్ఫ్ ప్రొపెల్డ్ రైలు సెట్, ఈ రైలు అత్యాధునిక ప్రయాణీకుల సౌకర్యాలను కలిగి ఉంటుంది. ప్రయాణీకులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
