తెలంగాణ ప‌ర్య‌ట‌కు ప్ర‌ధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ వివ‌రాలు ఇవిగో

Hyderabad: తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. 7,864 కోట్లతో ఆరు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అత్యాధునిక వసతుల కల్పనకు ప్రధాని రేపు భూమిపూజ చేయనున్నారు.
 

Prime Minister Narendra Modi to visit Telangana, Here are the complete schedule details RMA

PM Narendra Modi Telangana visit: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం  తెలంగాణ‌కు రానున్నారు. పలుమార్లు వాయిదాపడ్డ నరేంద్ర మోడీ పర్యటన ఎట్టకేలకు ఖరారు కావడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రేపు హైదరాబాద్ చేరుకోనున్న మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

శ‌నివారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. 7,864 కోట్లతో ఆరు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అత్యాధునిక వసతుల కల్పనకు ప్రధాని రేపు భూమిపూజ చేయనున్నారు.

మోడీ పర్యటనలో ప‌లు అభివృద్ధి పనులు, శంకుస్థాప‌న‌లు 

రాష్ట్రంలో మరో ఆరు జాతీయ రహదారుల విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలోని పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఇంతక ముందే మంజూరు చేసింది. విస్తరణ ప్రణాళికలు కొలిక్కిరావటంతో పాటు భూసేకరణ ప్రక్రియ ఎక్కువ భాగం పూర్తి అయినందున శంకుస్థాపనకు జాతీయ రహదారుల సంస్థ సిద్ధమైంది. ఆరు రహదారుల విస్తరణకు రూ.7,864 కోట్లలతో వ్యయం కానుంది. పనులకు టెండర్ల ప్రక్రియను కూడా అధికారులు చేపట్టారు.

వందే భార‌త్ రైలు ప్రారంభం.. 

రాష్ట్రంలో వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ రెండో రైలును ప్ర‌ధాని త‌న ప‌ర్య‌ట‌న‌లో ప్రారంభించ‌నున్నారు.  సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య రాకపోకలు సాగించనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపైకి వచ్చింది. రేపు సికింద్రాబాద్‌లోని ప్లాట్‌ఫామ్‌ 10 నుంచి ప్రధాని మోడీ ఈ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌- తిరుపతి నగరాల మధ్య రాకపోకలు సాగించనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 3 నెలల వ్యవధిలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రంగంలోకి దిగిన ఎస్​పీజీ స్టేషన్‌ను అధీనంలోకి తీసుకుంది. 500 మంది అధికారుల పర్యవేక్షణలో భద్రత కొనసాగనుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios