Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఆదివారం మోదీ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..

కోవిడ్ మహమ్మారి ప్రభావంతో గతేడాది శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు.  బడ్జెట్ సమావేశాలు,  వర్షాకాల సమావేశాలనూ  కుదించారు.  ఈ దఫా పార్లమెంటు ఉభయ  సభలు  ఇరవై రోజుల పాటు సమావేశం కానున్నాయి. కీలకమైన  ఉత్తర ప్రదేశ్ సహా  ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

prime minister modi to lead all-party meeting next Sunday 28th november
Author
Hyderabad, First Published Nov 22, 2021, 4:01 PM IST

ఢిల్లీ :  ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 28 ఆదివారం నాడు 
All-Party Conference జరుగనున్నట్లు సమాచారం.  ఈనెల 29 నుంచి  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనుంది. అదే రోజు సాయంత్రం భాజపా పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించనున్నారు.

అలాగే,  ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం కూడా  మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.  
Winter Sessions of Parliamentలను ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

Covid Protocol పాటిస్తూ సమావేశాలు నిర్వహించాలని సూచించింది.  కోవిడ్ మహమ్మారి ప్రభావంతో గతేడాది శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు.  బడ్జెట్ సమావేశాలు,  వర్షాకాల సమావేశాలనూ  కుదించారు.  ఈ దఫా పార్లమెంటు ఉభయ  సభలు  ఇరవై రోజుల పాటు సమావేశం కానున్నాయి. కీలకమైన  ఉత్తర ప్రదేశ్ సహా  ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇదిలా ఉండగా, నవంబర్ 19న ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన మూడు వ్యవసాయ చట్టలను వెనక్కి తీసుకునే నిర్ణయం ఈ సమావేశాల్లోనే తీసుకునే అవకాశం ఉంది. కాగా, గత శుక్రవారం  three farm lawsపై కేంద్రం వెనక్కి తగ్గింది. గతేడాది కేంద్రం తీసుకుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకన్నట్టుగా ప్రధాని narendra modi ప్రకటించారు. శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. 

Farm Laws: పంజాబ్, యూపీలో బీజేపీకి లైన్ క్లియర్!.. విపక్షాలకు నష్టమే?.. ‘మోడీ తరహా నిర్ణయం కాదిదీ’

రాబోయే parliament winter session 2021ల్లో దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. రైతులందరినీ క్షమాపణ కోరుతున్నట్టుగా మోదీ చెప్పారు. రైతులు  ఆందోళన విరమించాలని కోరారు. కాగా, ఈ సాగు చట్టాలను రద్దు చేయాలని గత ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇంకా PM Modi మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని చెప్పారు. బడ్జెట్‌లో రైతులకు కేటాయింపులు ఐదు  రెట్లు పెరిగాయని తెలిపారు. ‘మేము దేశంలోని గ్రామీణ మార్కెట్లను బలోపేతం చేసాము. చిన్న రైతులను ఆదుకోవడానికి అనేక పథకాలు తీసుకొచ్చాం. రైతులకు బడ్జెట్ కేటాయింపులు ఐదు రెట్లు పెరిగాయి. మైక్రో ఇరిగేషన్‌కు కూడా రెట్టింపు నిధులు ఇచ్చాం’ అని మోదీ  తెలిపారు. 

చిన్న రైతుల సాధికారత, బలోపేతానికి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని.. ఇది రైతులు, ఆర్థికవేత్తలు, వ్యవసాయ నిపుణుల డిమాండ్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైతులకు సరసమైన ధరలకే విత్తనాలు, 22 కోట్ల సాయిల్ హెల్త్ కార్డుల వంటి సౌకర్యాలను అందించడానికి తాము కృషి చేసినట్టుగా చెప్పారు. వ్యవసాయోత్పత్తిని పెంచడానికి ఇటువంటి అంశాలు దోహదపడ్డాయని వెల్లడించారు. తాము ఫసల్ బీమా  యోజనను  బలోపేతం చేశామని.. మరింత మంది రైతులను దాని కిందకు తీసుకొచ్చామని మోదీ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios