ఉత్తర గుజరాత్‌లో బనస్కాంతలోని దీసా వద్ద రానున్న ఎయిర్ బేస్ కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఇది దేశ భద్రతకు సమర్థవంతమైన కేంద్రంగా ఉద్భవిస్తుందని చెప్పారు. 

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో ఉత్తర గుజరాత్‌లో కొత్త వైమానిక స్థావరానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన చేశారు.అనంతరం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో -2022ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిగుమతి చేసుకోలేని మరో 101 వస్తువుల జాబితాను రక్షణ దళాలు విడుదల చేయనున్నాయని చెప్పారు.

కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ప్రశ్నపత్రం.. వివాదాన్ని రేపిన బిహార్ కొశ్చన్ పేపర్‌

దీంతో 411 రక్షణ సంబంధిత వస్తువులను స్థానికంగానే కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇది భారత రక్షణ పరిశ్రమకు పెద్ద ఊపునిస్తుందని ఆయన అన్నారు. ఇది అపూర్వమైన ఢిఫెన్స్ ఎక్స్ పో అని తెలిపారు. ఎందుకంటే కేవలం భారతీయ కంపెనీలు మాత్రమే మొదటిసారి ఇందులో పాల్గొంటున్నాయని అన్నారు. 

కూతురు వేరేకులం వ్యక్తిని ప్రేమించిందని.. దారుణంగా ఇద్దరినీ హత్య చేసి, నగ్నంగా నదిలో పడేసి.. ఓ తండ్రి ఘాతుకం..

ఉత్తర గుజరాత్‌లోని బనస్కాంతలోని దీసా వద్ద రానున్న ఎయిర్ బేస్ దేశ భద్రతకు సమర్థవంతమైన కేంద్రంగా ఉద్భవిస్తుంది అని తెలిపారు. గత కొన్నేళ్లలో భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఎనిమిది రేట్లు పెరిగాయని కూడా ఆయన చెప్పారు. ఇంతకుముందు పావురాలను వదిలామని, అయితే ఇప్పుడు చిరుతలను వదులుతున్నామని చెప్పారు. దేశం చాలా ముందుకు వచ్చిందని అన్నారు. 

Scroll to load tweet…