కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని తెలిసిన తండ్రి రాక్షసుడిగా మారాడు. కూతురు, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేసి వారిద్దరి శవాలను నగ్నంగా నదిలోకి విసిరేయించాడు. 

కర్ణాటక : బాగల్‌కోట్‌ జిల్లా బేవిన్‌మట్టి గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 17 ఏళ్ల బాలిక, ఆమె 22 ఏళ్ల ప్రియుడిని బాలిక కుటుంబ సభ్యులు హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాలను కృష్ణానదిలో పడేశారు. వాటిని ఇంకా వెలికితీయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అక్టోబర్ 1న జరగగా, మంగళవారం దీనికి కారణమైన బాలిక తండ్రి, ముగ్గురు బంధువులను బాగల్‌కోట్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెడితే వాల్మీకి వర్గానికి చెందిన విశ్వనాథ్ నేలగి కురుబ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలిక ప్రేమించుకుంటున్నారు. మరికొద్ది నెలల్లో బాలికకు 18 ఏళ్లు వస్తాయి. అయితే వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ.. బాలికకు 18 యేళ్లు రాగానే ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు.

సూట్ కేసులో మహిళ నగ్న మృతదేహం.. గొంతుకోసి చంపి దారుణం.. అత్యాచారం అనుమానం...

వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన బాలిక తండ్రి పంచాయతీ పెట్టించడంతో.. పెద్దలు విశ్వనాథ్ ను కాసరగోడ్ కు పంపించారు. అలా విశ్వనాథ్ మంగళూరులో దినసరి కూలీగా పనిచేసినట్లు పీఎస్‌ఐ బి. జనార్దన్‌ తెలిపారు. అక్టోబరు 1న విశ్వనాథ్ మంగళూరు నుంచి ఇంటికి తిరిగి రాగానే బాలిక గడగ్ జిల్లా నరగుండలో అతడిని కలవడానికి వెళ్లింది. అమ్మాయి కుటుంబం సభ్యులకు ఈ విషయం తెలిపింది. వీరిద్దరూ మళ్ళీ కలుసుకుంటున్నారన్న విషయం వారికి రుఢీ అయ్యింది. దీంతో అమ్మాయి తండ్రి పరసప్ప కరాడి తన కుమార్తెకు ఫోన్ చేసి, వారి పెళ్లి గురించి చర్చించడానికి ఇద్దరిని కలవాలనుకుంటున్నట్లు చెప్పినట్లు తెలిసింది.

వీరిద్దరినీ నరగుంద నుంచి తీసుకెళ్లేందుకు ఐదుగురు బంధువులను అమ్మాయి తండ్రి పంపించాడు. అక్కడినుంచి వారిద్దరినీ రెండు వేరు వేరు వాహనాల్లో బాగల్‌కోట్‌కు తీసుకువెళ్లారు. అలా వెళ్తుండగా మార్గమధ్యంలో రెండు వేర్వేరు వాహనాల్లో ఉన్న జంటమీద మిగతావారు దాడి చేశారు. విశ్వనాథ్ ను తీవ్రంగా కొట్టారు. అతని వృషణాలను నలిపివేశారు. బాలికను ఆమె దుపట్టాతో గొంతుకోసి హత్య చేశారు.

హత్య చేసిన తర్వాత వారిద్దరి బట్టలు విప్పి మృతదేహాలను వంతెనపై నుంచి కృష్ణానదిలోకి విసిరారు. ఆ సమయంలో బాలిక తండ్రి వారితో ప్రయాణించడం లేదని పోలీసులు తెలిపారు. పరసప్ప కరాడితో పాటు అతని బంధువులు రవి హుల్లన్నవర్, 18, హనుమంత్ మల్నాడ్, బీరప్ప దళవాయిలు అరెస్టయ్యారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను గుర్తించాల్సి ఉంది. అక్టోబరు 3న కొడుకు ఇంటికి రాకపోవడంతో నెలాగి తండ్రి మిస్సింగ్‌ ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 11న పరసప్ప కూడా తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆమె మైనర్ కావడంతో పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేశారని జనార్దన్ తెలిపారు.

రవి హళ్లన్నవర్‌ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతను ఈ హత్య విషయం మీద బ్రోక్ డౌన్ అయ్యాడు. విసయం అంతా తెలిపాడు. వారిద్దరి ప్రేమ విషయం తెలిసిన పరసప్ప తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత పరసప్ప హత్యకు పథకం రచించి, తామందరినీ రంగంలోకి దించాడని చెప్పుకొచ్చాడు. దీంతో బాగల్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో నరసప్ప మీద మిగతా వారిమీద కేసు నమోదైంది.