సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతును ప్రారంభించిన మోడీ


మహారాష్ట్రలో ఇవాళ రూ. 30,500 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను ప్రధాన మంత్రి మోడీ  ప్రారంభించారు.

Prime Minister  Modi inaugurates Atal Bihari Vajpayee Sewri-Nhava Sheva Atal Setu  Bridge lns

ముంబై: దేశంలోనే సముద్రంపై  అతి పొడవైన వంతెనను  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  శుక్రవారంనాడు  ప్రారంభించారు. దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ స్మారకార్ధం ఈ వంతెనకు అటల్ సేతుగా నామకరణం చేశారు. ఈ బ్రిడ్జికి రూ. 17,840 కోట్లు ఖర్చు పెట్టారు.  

also read:సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

మహారాష్ట్రలో  అటల్ సేతు బ్రిడ్జి ప్రారంభోత్సవంతో పాటు  సుమారు రూ. 30,500 కోట్ల విలువైన  ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.ఇవాళ ఉదయం  తొలుత నాసిక్ లో  పలు కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నారు. నాసిక్ లో రోడ్డు షో లో పాల్గొన్నారు.  నాసిక్ లోని కాలారం శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపర్చారు. 

also read:రాముడు నడయాడిన నేలలో మోడీ పూజలు: నాసిక్‌లో రోడ్ షో

ఆ తర్వాత నాసిక్ లో  27వ జాతీయ యూత్ ఫెస్టివల్ లో మోడీ పాల్గొన్నారు. వంశపారంపర్య రాజకీయాల ప్రభావాన్ని తగ్గించేందుకు  యువత రాజకీయాల్లోకి రావాలని మోడీ కోరారు. ఇవాళ మధ్యాహ్నం ముంబైలోని అటల్ సేతును మోడీ ప్రారంభించారు. అనంతరం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ నమూనాను  పరిశీలించారు.అటల్ సేతు బ్రిడ్జి గురించి మోడీకి అధికారులు  వివరించారు. 

also read:నాసిక్ కాలారం ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపర్చిన మోడీ

అటల్ సేతు బ్రిడ్జి నిర్మాణంతో  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నవీ ముంబైకి వేగవంతమైన కనెక్టివిటిని అందిస్తుంది.భారతదేశపు పొడవైన సముద్ర వంతెన పొడవు 21.8 కి.మీ. ఇందులో  16.5  కి.మీ సముద్రంపైన ఉంటుంది. మిగిలిన ఐదు కి.మీ భూమిపై ఉంటుంది. ఈ బ్రిడ్జిపై  ప్రతి రోజూ కనీసం 40 నుండి 70 వేల వరకు ప్రయాణించే అవకాశం ఉందని  అధికారులు అంచనా వేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios