ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మహారాష్ట్రలోని గోదావరి నది తీరంలో ఉన్న శ్రీరాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు మహారాష్ట్రలోని నాసిక్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాసిక్ లోని కాలారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాసిక్ లోని గోదావరి నది తీరాన ఉన్న కాలరామ మందిరంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో సీతారాములు ఉన్నట్టుగా స్థల పురాణం చెబుతుంది.
రామాయణానికి సంబంధించిన ప్రదేశాల్లో పంచవటికి ప్రత్యేక స్థానం ఉంది. రామాయణంలోని అనేక ముఖ్యమైన ఘటనలు ఇక్కడ జరిగినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. సీతారాములు, లక్ష్మణుడు దండకారణ్యంలోని అడవి ప్రాంతంలో కొన్ని ఏళ్ల పాటు గడిపినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. పంచవటికి ఐదు చెట్ల భూమి అని అర్ధం. ఐదు మర్రిచెట్లు ఉన్నందున ఈ ప్రాంతాన్ని రాముడు కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

also read:సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ...

అయోధ్యలోని భవ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి 11 రోజుల ముందు ఈ ప్రదేశాన్ని మోడీ సందర్శించుకోవడం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఆలయానికి రాముడి జీవితంలో ప్రాముఖ్యత ఉంది.
రామాయణంలోని పురాణ కథ యుద్ద కాండలో శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడాన్ని కథనాన్ని మోడీ విన్నారు. ఇది మరాఠీలో ఉంది.అయితే దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎఐ వెర్షన్ ద్వారా హిందీలో విన్నారు.
