జర్మన్ మహిళ పాటను ఆస్వాదిస్తూ.. దరువేసిన ప్రధాని మోడీ...

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి జర్మన్ గాయని ఒకరు శ్రీరాముడిభక్తి గీతాన్ని పాడారు. అది ఆ సమయంలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడా గాయని, తన తల్లితో కలిసి భారత్ ను సందర్శించారు. 

Prime Minister Modi Enjoying German woman's song 'Achyutam Keshavam' - bsb

చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం భారత్ కు వచ్చిన ఓ జర్మనీ గాయనిని కలిశారు. ప్రధాని ఆమె గురించి గతంలో తన 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లలో ప్రస్తావించారు. జర్మన్ గాయని కసాండ్రా మే స్పిట్‌మన్, ఆమె తల్లిని తమిళనాడులోని పల్లడంలో మోదీ కలిశారు. భారతీయ సంగీతం, సంస్కృతి పట్ల కసాండ్రా మే కున్న అభిరుచిని ప్రధాని మోదీ గతంలో ప్రశంసించారు.

ఈ సమావేశంలో కసాండ్రా మే ‘అచ్యుతం కేశవం’ పాటతో పాటు ఓ తమిళ పాటను కూడా ప్రధాని ముందు ప్రదర్శించారు. అదే సమయంలో, ప్రధాని మోదీ కూడా భజనను ఆస్వాదిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగుచూసింది. అందులో కసాండ్రా ప్రధాని మోడీ ముందు పాడటం, ప్రధాని ప్రశంసించడం కనిపిస్తుంది. 

సెప్టెంబరు 2023లో, దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ప్రధాని మోడీ మాట్లాడుతూ, "భారతీయ సంస్కృతి, భారతీయ సంగీతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు వాటికి ఆకర్షితులవుతున్నారు" అన్నారు. కసాండ్రా మే పాడిన భారతీయ పాటను ప్రధాని ప్లే చేశారు.

అంబానీ కొడుకు ప్రీ-వెడ్డింగ్ లో 2,500 రకాల వంటకాలు.. ఒక్కో ప్లేట్ ఖర్చు ఎంతో తెలుసా..?

"మధురమైన స్వరం.. ప్రతి పదం భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. ఆమెకు భగవంతునితో ఉన్న అనుబంధాన్ని మనం కూడా అనుభూతి చెందుతాం. ఈ స్వరం జర్మనీకి చెందిన యువతిది అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆమె పేరు కాస్మే. 21 ఏళ్ల కాస్మే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్. జర్మన్ జాతీయురాలైన కాస్మే భారతదేశానికి ఎప్పుడూ రాలేదు. కానీ, ఆమెకు భారతీయ సంగీతం అంటే చాలా ఇష్టం”అని పాట ప్రదర్శన తర్వాత మోడీ అన్నారు.

జర్మన్ గాయకురాలి అభిరుచిని "స్పూర్తిదాయకం" అని పేర్కొన్న ప్రధాని, "భారత్‌ను ఎన్నడూ సందర్శించని వ్యక్తిలోని అలాంటి ఆసక్తి స్ఫూర్తిదాయకం. కాస్మే పుట్టినప్పటి నుండి దృష్టిలోపం ఉంది. కానీ ఈ సవాలు ఆమెను ఈ అసాధారణ విజయాన్ని సాధించకుండా ఆపలేకపోయింది. సంగీతం, సృజనాత్మకత పట్ల ఆమెకున్న అభిరుచి ఆమె చిన్నతనంలోనే పాడటం ప్రారంభించింది."

కసాండ్రా కేవలం హిందీలోనే కాకుండా ఇతర భారతీయ భాషల్లో కూడా పాడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యంగా, కాసాండ్రా మే స్పిట్‌మన్ అనేక తమిళ పాటల కవర్‌లను, ముఖ్యంగా భక్తిగీతాలను పాడడంలో ప్రసిద్ధి చెందింది. ఆమె ఖచ్చితత్వం, భాష, సాహిత్యం, దోషరహితమైన ఉచ్ఛారణకు ప్రశంసలు పొందుతున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios