Asianet News TeluguAsianet News Telugu

అంబానీ కొడుకు ప్రీ-వెడ్డింగ్ లో 2,500 రకాల వంటకాలు.. ఒక్కో ప్లేట్ ఖర్చు ఎంతో తెలుసా..? 

Anant Ambani Radhika Merchant Pre Wedding: ముకేశ్‌ అంబానీ , నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్‌  (Anant Ambani) పెళ్లికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. త్వరలో తన స్నేహితురాలు రాధిక మర్చంట్‌ ను (Radhika Merchant) త్వరలో  వివాహం చేసుకోబోతున్నాడు.

Anant Ambani-Radhika Merchant pre-wedding 2,500 dishes on menu KRJ
Author
First Published Feb 28, 2024, 5:40 AM IST | Last Updated Feb 28, 2024, 5:40 AM IST

Anant Ambani Radhika Merchant Wedding: ప్రపంచ కుబేరుడు, రిలియన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) చిన్న కొడుకు అనంత్ అంబానీ (Anant Ambani) త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు రాధికా మర్చెంట్‌ను (Radhika Merchant) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ తరుణంలో మార్చి 1-3 తేదీల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుక  జరగనుంది. ఈ వేడుకకు దేశ, విదేశాల నుండి సుమారు 1000 మంది వ్యాపార ప్రముఖులు ఈ వేడుకకు రానున్నారు. బిల్ గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్  వంటి అంతర్జాతీయ ప్రముఖులు అనంత్-రాధికలను ఆశీర్వదించనున్నారు. 

ఈ గ్రాండ్ ఈవెంట్ (Pre-wedding event) కోసం అంబానీ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.  ఈ ఈవెంట్ లో ప్రతిది చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ తరుణంలో ఫుడ్ మెనూ కూడా అంతే ప్రత్యేకంగా ఉండబోతుందట. వార్త కథనాల ప్రకారం..  ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం ఇండోర్ నుండి సుమారు 25 మంది చెఫ్‌లతో కూడిన ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు.ఈ ఈవెంట్ లో ఇండియన్ పుడ్ తో పాటు ఏషియన్ కాంటినెంటల్, మెడిటేరియన్, పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్ ఫుడ్స్‌ను సిద్ధం చేస్తారట. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో దాదాపు 2500 రకాల వంటకాలను అతిథులకు అందించనున్నారు. ఇందులో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం, ఇతర స్నాక్స్ ఉంటాయి.  

సమాచారం ప్రకారం..బ్రేక్ ఫాస్ట్ మెనూలో 70 వంటకాలు, లంచ్ లో 250 వంటకాలు, రాత్రి భోజనంలో 250 రకాల ఆహార పదార్థాలను అతిథులకు అందించనున్నారు. ఈ మూడు రోజుల వేడుకలో  ఏదీ రిపీట్ చేయకుండా అతిథులకు నోరూరించే వంట‌కాల‌ను వండివార్చ‌నున్నారు. ఇక ఓవరాల్ గా ఒక్క రోజుకి ఒక మనిషి భోజనం ఖరీదు కనీసం రూ 15 వేలు వరకు అవుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రీ వెడ్డింగ్ కే ఇంత ఖర్చు చేస్తున్నా ముఖేష్ అంబానీ .. మరీ పెళ్లికి ఏ లెవెల్ లో ఖర్చు పెడతారో అనే క్యాలిక్యులేషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. 

ఇదిలా ఉంటే.. జనవరి 2023లో అనంత్-రాధిక నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. అతిథి జాబితాలో వివిధ రంగాలకు చెందిన పెద్ద పేర్లు ఆహ్వానించబడ్డాయి. ఈ వేడుకకు మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ హాజరవుతారని చర్చ జరుగుతోంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios