Asianet News TeluguAsianet News Telugu

ఐస్ క్రీం కోసం వెళ్లి, విగతజీవిగా మారిన గర్భిణి.. రాత్రంతా శవం పక్కనే నాలుగేళ్ల చిన్నారి....

కొడుకుకు ఐస్ క్రీం కొనివ్వడానికి ఇంట్లోనుంచి వెళ్లి, కనిపించకుండా పోయిన గర్భిణి మృతదేహంగా లభ్యమయ్యింది.  ఆమె నాలుగేళ్ల కొడుకు మృతదేహం పక్కనే కూర్చొని ఉన్నాడు. 
 

pregnant woman who missing with her 4years old son, found dead, child sits beside corpse all night - bsb
Author
First Published Oct 20, 2023, 1:51 PM IST

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఐస్‌క్రీం కోసం తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి వెళ్లి కనిపించకుండా పోయిన గర్భిణి గురువారం ఉదయం నది వంతెన సమీపంలో శవమై కనిపించింది. నాలుగేళ్ల చిన్నారి రాత్రంతా తల్లి శవం దగ్గర కూర్చున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే... 

సుష్మా కక్డే అనే మహిళ బుధవారం రాత్రి 9:30 గంటలకు బల్లార్‌పూర్‌లోని టీచర్స్ కాలనీలో ఉన్న తన ఇంట్లో నుండి వెళ్లి కనిపించకుండా పోయింది. నాలుగేళ్ల వయసున్న కొడుకు దుర్వంశ్‌తో కలిసి వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తరువాత ఎంతకీ తిరిగి రాలేదని చెప్పినట్లు.. పోలీసు సూపరింటెండెంట్ రవీంద్ర సింగ్ పర్దేసి తెలిపారు.

ఇద్దరు వ్యక్తులపై సామూహిక అత్యాచారం.. ముగ్గురి అరెస్టు, మరో ఇద్దరి కోసం గాలింపు...

బ్యాంక్ ఉద్యోగి అయిన ఆమె భర్త పవన్‌కుమార్ కక్డే, ఇతర బంధువులు ఆమె కోసం కొంతసేపు వెతికి ఆ తర్వాత బల్లార్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారని ఎస్పీ తెలిపారు. రాజురా-బల్లార్‌పూర్ రోడ్డులోని వార్ధా నది వంతెన సమీపంలో సుష్మ మృతదేహం కనిపించడంతో కొందరు వ్యక్తులు పవన్‌కుమార్, అతని బంధువులకు సమాచారం అందించారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకునేసరికి చిన్నారి దుర్వంశ్ మృతదేహం దగ్గర కూర్చుని ఉండడం కనిపించింది. 

"ప్రాథమిక విచారణలో ఆమె బుధవారం అర్థరాత్రి వంతెనపై నుండి బురద ప్రాంతంలో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే, మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి అన్ని కోణాలలో పరిశీలిస్తున్నాం.. కేసు నమోదు చేశాం, దర్యాప్తు చేస్తాం" అని పరదేశి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios