Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు వ్యక్తులపై సామూహిక అత్యాచారం.. ముగ్గురి అరెస్టు, మరో ఇద్దరి కోసం గాలింపు...

గే కపుల్ అయిన ఇద్దరు వ్యక్తులపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

Gang rape of two men,Three arrested in Delhi's Shakarpur - bsb
Author
First Published Oct 20, 2023, 1:18 PM IST | Last Updated Oct 20, 2023, 1:18 PM IST

ఢిల్లీ : ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు బంగ్లాదేశ్ యువకులపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబరు 17న LGBTQ+ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు వ్యక్తుల మీద ఈ లైంగిక దాడి జరిగింది. వారికి పరిచయం ఉన్న ఓ వ్యక్తి తన నలుగురు స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు.  

ఈ ఘటన తరువాత బాధితులిద్దరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వెంటనే దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు అనుమానితులను అరెస్టు చేయడానికి పిసిఆర్ అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు వేగంగా చర్య తీసుకున్నారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే, షకర్పూర్ పోలీస్ స్టేషన్ నుండి 20 మంది పోలీసుల బృందం విచారణ ప్రారంభించింది. 

పొరపాటున రూ.12 లక్షల విలువైన నగలు చెత్తకుప్పల్లో వేశాడు..చివరికి...

ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని 50 కెమెరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నిందితులను విజయవంతంగా గుర్తించారు. ముగ్గురు నిందితులను 20 ఏళ్ల దేవాశిష్ వర్మ, 21 ఏళ్ల సుర్జీత్, 20 ఏళ్ల ఆర్యన్ అలియాస్ గోలుగా గుర్తించారు. మరో ఇద్దరు నిందితుల జాడ తెలియాల్సి ఉంది. బాధితులిద్దరూ రామ్‌లీలా చూసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. 

నిందితుల్లో ఒకరు బాధితులకు తెలిసిన వ్యక్తే. దీంతో వారు అతడితో మాట్లాడారు. పరిచయస్తుడైన నిందితుడు వారిద్దరి మీద తన ఇతర స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 

బాధితులిద్దరూ స్వలింగ సంపర్కుల జంట. ఈ విషయం తెలుసుకున్న నిందితులు బాధితులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఐదుగురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని 323 (బాధ కలిగించడం), 377 (అసహజ నేరాలు), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద కేసు నమోదు చేయబడింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios