కరోనా వైరస్ భయం ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ఆ వైరస్ భయపెడుతున్న తీరు కూడా అలానే ఉంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా మాంసాహారం తినడం వల్లే వస్తోందనే అపోహ చాలా మందిలో కలిగింది. ఈ క్రమంలో చికెన్ తినడాన్ని పూర్తిగా మానేయడం గమనార్హం.

Also readకరోనా బాధితులకు పోర్న్ సైట్ బంపర్ ఆఫర్...

మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వయంగా.. చికెన్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అని వివరించినా ప్రజలు పట్టించుకునే స్థాయిలో లేకపోవడం గమనార్హం. చికెన్ కన్నా.. కూరగాయలవైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూరగాయల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.

కరోనా ప్రభావంతో కోళ్ల విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఒక కోడి తీసుకుంటే మరో కోడి ఉచితం అంటూ పలుచోట్ల బోర్డులు దర్శనమిస్తున్నాయి. కర్నాటకలోని బనశంకరిలో చికెన్ ధరలు పాతళానికి పడిపోయాయి. ఒక కోడి రూ. 8 మాత్రమేనని చికెన్‌ దుకాణల వద్ద బోర్డులు పెట్టారు. అటు కొన్ని చోట్ల కోళ్లను ఫ్రీగా కూడా ఇచ్చేస్తున్నారు. గురువారం కరావళి ప్రాంతమైన పుత్తూరులో చికెన్‌ ధరలు ఆశ్చర్యం కలిగించగా హెచ్‌1 ఎన్‌1 నేపథ్యంలో కూడా చికెన్‌ ధరల్లో భారీ తగ్గుముఖం కనబడింది. కరోనా, హెచ్‌1ఎన్‌1 భయంతో కోళ్ల ధరలు కిలో 8 రూపాయలకు ఊహించని విధంగా పడిపోయింది.