కరోనా పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకేసింది. భారత్ లో సైతం తొలి కరోనా కేసు నమోదైంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 4వేల మందికిపైగా కన్నుమూశారు. మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.

Also Read కెనడా ప్రధాని భార్యకు కరోనా.. ఆమెను కలిసినవారందరికీ..

ఇటలీలోనూ కరోనా కలకలం మరింత దారుణంగా తయారైంది. ఇటలీలో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. నిన్నటి వరకు 189 ఉన్న మృతుల సంఖ్య 24గంటల్లోనే 1,016కు చేరింది. దాదాపు 15వేల మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రముఖ పోర్న్‌సైట్‌ ‘‘పోర్న్‌హబ్‌’’ తన ఉదారతను చాటుకుంది. తమ అనుబంధ సైట్‌ ‘‘మోడల్‌ హబ్‌’’ నుంచి వచ్చే మార్చి నెల ఆదాయాన్ని కరోనా బాధితుల సహాయార్థం విరాళంగా ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

అంతేకాకుండా ఇటలీ ప్రజలు పోర్న్ హబ్ సైట్ ప్రీమియమ్ కంటెంట్ ను ఈ నెలమొత్తం ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా. పోర్న్ హబ్ ను వీక్షిస్తున్న తొలి 20 దేశాల్లో ఇటలీ 7 వ స్థానంలో ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడయ్యింది. పోర్న్ హబ్ సైట్లలో సైతం కరోనా అవగాహన వీడియోలు పెడుతుండటం విశేషం.