Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఎలక్ట్రానిక్ కంపెనీలో చెలరేగుతున్న మంటలు..

ముంబాయిలోని ఓ ఎల్ఈడీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. ఈ ఘటనపై సమాచారం అందడంతో ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

A huge fire in Mumbai.. The fire broke out in an electronic company..
Author
First Published Jan 25, 2023, 2:17 PM IST

ముంబైలోని నలసోపరా ప్రాంతంలోని ఓ ఎలక్ట్రానిక్ కంపెనీలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక్క సారిగా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే నాలుగు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు.

లఖింపూర్ ఖేరీ కేసు: 8 మంది రైతుల ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్

స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. వాకపాండా ప్రాంతంలో ఉన్న రామా ఇండస్ట్రీస్ ఎల్ఈడీ తయారీ యూనిట్‌లో మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో ఒక్క సారిగా గందరగోళం నెలకొంది. స్థానికులు వెంటనే  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తోంది. అయితే మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయి. 

ఇక మినీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు.. మార్చి - ఏప్రిల్ లో ప్రారంభించేందుకు అధికారుల సన్నాహకాలు

అదృష్టవశాత్తూ ఈ విషాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. కానీ మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ అగ్ని సమీపంలోని నివాసాలకు, దుకాణాలకు వ్యాపించే అవకాశం ఉంది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అవి మంటల తీవ్రత తీరును స్పష్టంగా చూపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios