ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్ట్ తుది తీర్పును ఫిబ్రవరి 9న ఇవ్వనుంది

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు పరిగణనలోనికి తీసుకున్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్ట్ తుది తీర్పును ఫిబ్రవరి 9న ఇవ్వనుంది. 

ALso Read: ఢిల్లీ లిక్కర్ స్కాం : ఈడీ దూకుడు, నిందితుల ఆస్తులు అటాచ్

ఇదిలావుండగా.. ఈ కేసులోని నిందితుల ఆస్తులను మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్‌ల నివాసాలతో పాటు దినేశ్ అరోరా, అమిత్ అరోరా ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను విచారణకు స్వీకరించాలా వద్ద అనే దానిపై సీబీఐ కోర్ట్ ఈ నెల 28న నిర్ణయం తీసుకోనుంది. మొత్తం 13,567 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఐదుగురు నిందితులు, ఏడు కంపెనీలపై అభియోగాలు వున్నట్లు ఈడీ తరపు న్యాయవాది గతంలోనే కోర్టుకు వివరించారు.