Asianet News TeluguAsianet News Telugu

పిల్లల విషయంలో రాజకీయ పార్టీలు సున్నితంగా ఉండాలి - ఎన్‌సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో

పిల్లల విషయంలో రాజకీయ పార్టీలు సున్నితంగా వ్యవహరించాలని ఎన్‌సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో అన్నారు. బాల్య వివాహాలను నిషేధించేందుకు అస్సాం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన ప్రశంసించారు.

Political parties should be sensitive when it comes to children - NCPCR chief Priyank Kanungo
Author
First Published Feb 5, 2023, 4:12 PM IST

అస్సాంలో బాల్య వివాహాలకు సంబంధించి హేమంత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఓ వైపు రాజకీయ రగడ మొదలవగా.. మరోవైపు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) వాటిని సమర్థించింది. బాల్య వివాహాల నిషేధ చట్టం (పీసీఎంఎ) ప్రకారం అస్సాం ప్రభుత్వం నిబంధనలను రూపొందించలేదని ఏఐయూడీఎఫ్ చేసిన ప్రకటనను ఎన్‌సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో కొట్టిపారేశారు. ఆదివారం ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ.. ‘‘పిల్లల విషయంలో రాజకీయ పార్టీలు సున్నితంగా వ్యవహరించాలి. బాల్య వివాహ చట్టం, పోక్సో లు కేంద్ర చట్టాలు. అవి మోడల్ రూల్స్‌తో బాగానే ఉంటే, అస్సాం ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను రూపొందించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇలాంటి మూర్ఖపు రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారో అర్థం కావడం లేదు.’’ అని ఆయన అన్నారు. 

చేతిలోనే పేలిన నాటు బాంబు .. రెండు చేతులు పొగొట్టుకున్న గ్యాంగ్‌స్టర్

బాల్య వివాహాలకు పాల్పడే పెద్దలకు వ్యతిరేకంగా అస్సాం ప్రభుత్వ చొరవను ఎన్‌సీపీసీఆర్ ప్రశంసించిందని, ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామని ప్రియాంక్ కనుంగో అన్నారు. ‘‘అస్సాం ప్రభుత్వం నిబంధనలను రూపొందించలేదని చేసిన ఏఐయూడీఎఫ్ ప్రకటన అవివేకమైంది ’’ అని ఆయన అన్నారు. 

అదానీ సమస్యతో దేశ ప్రతిష్ట ప్రమాదంలో పడింది - బీఎస్పీ అధినేత్రి మాయావతి

కాగా.. బాల్య వివాహాల నిషేధ చట్టం (పీసీఎంఏ)లోని నిబంధనల ప్రకారం అసోం ప్రభుత్వం అవసరమైన నిబంధనలను రూపొందించకుండా బాల్య వివాహాలపై కఠినంగా వ్యవహరిస్తోందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) శనివారం ఆరోపించింది. పీసీఎంఏ అమలుకు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించలేదని ఏఐయూడీఎఫ్ ప్రధాన కార్యదర్శి అమీనుల్ ఇస్లాం పేర్కొన్నారు. ‘‘ 2006 నాటి పీసీఎంఏ 2007 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కేంద్ర చట్టం కాబట్టి రాష్ట్రాలు నిబంధనలు రూపొందించాలి. 2007 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో, ఆ తర్వాత బీజేపీ హయాంలో ప్రభుత్వం ఎందుకు నిబంధనలు రూపొందించలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. 

బాలల హక్కులను పరిరక్షించే సంస్థలపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని కూడా కాంగ్రెస్ ప్రశ్నించింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం నుంచి బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి కేసుల్లో నమోదైన 4,074 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇప్పటివరకు 2,258 మందిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇవి కొనసాగుతాయని సీఎం హిమంత విశ్వ శర్మ శనివారం తెలిపారు.

పర్వేజ్ ముషారఫ్ మరణం: కార్గిల్ యుద్ధం మాస్టర్ మైండ్, కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రయత్నం.. ఆసక్తికర వాస్తవాలు

కాగా.. నిబంధనలను రూపొందించకుండా రాష్ట్రం చట్టాలను అమలు చేయవచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని గౌహతి హైకోర్టు సీనియర్ న్యాయవాది తెలిపారని వార్తా సంస్థ ‘పీటీఐ’ నివేదించింది. “కేంద్ర చట్టం సమగ్రంగా ఉంటే ప్రత్యేకంగా రాష్ట్రాలు చట్టాలను రూపొందించాల్సిన అవసరం లేకుండానే అమలు చేయవచ్చు. దీనికి అనుకూలంగా అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి” అని ఆయన అన్నారు. అయితే అస్సాంలో పీసీఎంఏ విషయంలో ఇంకా నిబంధనలు రూపొందించలేదనే విషయం తనకు తెలియదని న్యాయవాది తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios