పోలీస్ వ్యాన్ ఢీకొని 6 ఏళ్ల బాలిక మృతి.. ఘటనాస్థలంనుంచి పారిపోయిన పోలీసులు..
ఘటనకు పాల్పడిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని గురుగ్రామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వికాస్ కౌశిక్ తెలిపారు.

గురుగ్రామ్ : గురుగ్రామ్-ఫరీదాబాద్ రోడ్డులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెడుతున్న గురుగ్రామ్ పోలీసులకు చెందిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ (ఇఆర్‌వి) ఓ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ కారణంగా ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఇఆర్‌విడ్రైవర్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీఓ) హెడ్ కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు ప్రారంభిస్తామని గురుగ్రామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వికాస్ కౌశిక్ ఆదివారం తెలిపారు. నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు వ్యక్తులు, ఇద్దరు మహిళలు, కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
9 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్వాల్ పహారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ రాంగ్ సైడ్‌లో ప్రయాణిస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి అందిన సమాచారం ప్రకారం ప్రమాదం తరువాత.. వాహనంలో ఉన్న పోలీసులు సంఘటన స్థలం నుండి పారిపోయారు.
"ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిసిఆర్ వ్యాన్ డ్రైవర్‌తో సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు గురుగ్రామ్ ఎసిపి వికాస్ కౌశిక్ తెలిపారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ భర్త మాట్లాడుతూ.. తానూ, తన భార్య, అత్తగారు, బావమరిది.. ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీ నుండి ఫరీదాబాద్‌కు వెళ్తున్నామని అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు.
"ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పోలీసులు పారిపోకుండా.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తే.. నా కుమార్తె ఈ రోజు బతికే ఉండేది" అని విశ్వజీత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 279, 337, 427, 304ఏ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.