చిన్న పిల్లాడిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. దొంగతనం చేశాడనే అనుమానంతో బాలుడిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ దారుణం జ‌రిగింది.సైకిల్‌ను దొంగిలించాడనే ఆరోపణతో ఓ 9 ఏళ్ల బాలుడిని పోలీసులు చిత‌క‌బాదారు. జబల్‌పూర్‌లో నివాస ప్రాంతంలోని వీధిలో ఇది చోటు చేసుకుంది. ఈ వీధిలో బాలుడు న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా బైక్‌లపై వచ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు క్రూరంగా కొట్టారు. ఇందులో ఒక‌రు పోలీసు కానిస్టేబుల్. అత‌డు సివిల్ డ్రెసులో ఉన్నాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలు జ‌ర‌గగా.. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో రికార్డయింది.

కుండలో నీళ్లు తాగాడని దళిత విద్యార్థిని కొట్టిన టీచర్.. చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు..

స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ (ఎస్‌ఏఎఫ్) 6వ బెటాలియన్‌కు చెందిన అశోక్ థాపా అనే కానిస్టేబుల్ ఈ ఘటనలో దాడి చేసిన వారిలో ఒకరిగా గుర్తించామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సిద్దార్థ్ బహుగుణ తెలిపారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బైక్‌లపై వ‌చ్చారు. అందులో ఒక‌రు ఆ పిల్లాడిని ప‌ట్టుకున్నాడు. తెల్లాటి ష‌ర్ట్ ధ‌రించిన ఓ వ్యక్తి ఆ పిల్లాడిని త‌న్న‌డం ఆ వీడియోలో క‌నిపించింది. అలాగే టీ-షర్ట్‌లో ఉన్న వ్యక్తి ఆ పిల్లవాడి జుట్టును పట్టుకుని కనికరం లేకుండా కొడుతున్నాడు. 

Scroll to load tweet…

ఇంత‌లో మ‌రో వ్య‌క్తి అక్క‌డికి బైక్ పై చేరుకున్నాడు. ఈ విష‌యంలో జోక్యం చేసుకొని, ఆ పిల్లాడిపై దాడి జ‌ర‌గ‌కుండా ఆపేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. కానీ టీ-షర్టులో ఉన్న వ్యక్తి అత‌డిని దూరంగా నెట్టేస్తాడు. అక్క‌డే ఉన్న ఓ మహిళ కూడా దీనిని ఆపేందుకు ప్రయత్నించింది. కానీ అత‌డు ఆ పిల్లాడిని బైక్ పై ఎక్కించుకొని వేగంగా వెళ్లిపోయాడు. అయితే ఈ ఘ‌ట‌న‌పై రాంఝీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. తదుప‌రి చ‌ర్య కోసం కానిస్టేబుల్‌కు నోటీసు జారీ చేసినట్లు చెప్పారు.

Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ బిగ్ బుల్‌ రాకేష్ జున్‌జున్‌వాలా కన్నుమూత

‘‘ సైకిల్ దొంగతనం విషయం చెప్పడంతో ఓ కానిస్టేబుల్ మస్తానా స్క్వేర్ సమీపంలో బాలుడిని పట్టుకుని కొట్టారు. అతడిపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష), 294 (అశ్లీల చర్య) సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టంలోని సెక్ష‌న్ కూడా న‌మోదు అయ్యింది’’ అని జబల్‌పూర్ SSP ప్రదీప్ పాండే తెలిపారు.