దేశంలో రోజు రోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి. కోపం, పగ, ప్రతీకారం అంటూ.. ఒకరిని మరొకరు కిరాతకంగా చంపుకుంటున్నారు. మరి కొందరు కామాంధుల్లా మారి చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.  

పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇలాంటి నేరాలు-ఘోరాలు ఎన్నో చూడాల్సి వస్తోంది. తాజాగా.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిని చంపేసి.. ఆ తర్వాత అతనిపై మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read హోలీ సంబరాల్లో మైనర్ బాలికపై అత్యాచారం..చనిపోయిందనుకొని..

పూర్తి వివరాల్లోకి వెళితే... జార్ఖండ్, బీహార్ లకు చెందిన ఇద్దరు వ్యక్తులు దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరై ఏరియాలో ఉంటున్నారు. అదే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తితో వాళ్లకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారడంతో.. తరచూ కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారు.

కాగా.. ఇటీవల ముగ్గురూ కలిసి మందు పార్టీ చేసుకోవడానికి సిట్టింగ్ వేశారు. ఈ నేపథ్యంలో సదరు ఇద్దరు మిత్రులకు మరో వ్యక్తితో గొడవ అయ్యింది. మద్యం మత్తులో కొత్త మిత్రుడిని గొంతు నులిమి చంపేశారు. అనంతరం తమ కామ వాంఛని అతని శరీరంతో తీర్చుకున్నారు.

ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయి శవాన్ని మాయం చేయటానికి బుధవారం ఉదయం మళ్లీ ఆ ఇంటి వద్దకు వచ్చారు. శవాన్ని తరలిస్తున్న సమయంలో ఆ ఇద్దరూ మృతుడి సోదరి కంటపడ్డారు. ఆమె గట్టిగా అరవటంతో అక్కడినుంచి పరుగులు తీశారు. 

సోదరుడి దారుణ హత్యపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు. గొడవ కారణంగానే అతడ్ని చంపేసినట్లు విచారణలో వారు అంగీకరించారు.