అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఎవరూ చూడకుండా దూరంగా తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Also Read భర్త శవంతో రాత్రంతా వివాహిత జాగారం.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిహార్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మంగళవారం హోలీ సంబరాలు జరుపుకున్నారు.  ఆ సమయంలో ఓ కామాంధుడు.. ఎవరూ చూడకుండా మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు. ఎవరూ చూడని ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమాడు.

దీంతో బాలిక స్పృహ తప్పి పడిపోయింది. కాగా... బాలిక చనిపోయింది అని భావించి ఆ కామాంధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్నారిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ కన్నుమూసింది. తీవ్ర రక్తస్రావమై బాలిక కన్నుమూసిందని వైద్యులు చెప్పారు.

కాగా చిన్నారిపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్థారించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.