Asianet News TeluguAsianet News Telugu

PMJKAY Extended : మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్.. ఛత్తీస్ గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ప్రకటన..

PMJKAY : బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్ల పాటు పొడగించింది. దీని వల్ల దేశంలోని  80 కోట్ల మంది పేదలకు లబ్దిచేకూరనుంది. చత్తీస్ గఢ్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. 

PMJKAY Extended : Free ration for another five years.. PM Modi's announcement in Chhattisgarh election campaign..ISR
Author
First Published Nov 4, 2023, 5:20 PM IST

Pradhan Mantri Garib Kalyan Anna Yojana : వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime minister modi) కీలక ప్రకటన చేశారు. కరోనా మహమ్మరి సమయం నుంచి ఇస్తున్న ఉచిత రేషన్ పంపిణీని మరో ఐదేళ్ల పాటు పొడిగించారు. ఈ విషయాన్ని ప్రధాని ఛత్తీస్ గఢ్ లో జరిగిన బహిరంగ సభ లో వెల్లడించారు. వచ్చే ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

Navy helicopter crash : కొచ్చి ఎయిర్ స్టేషన్ లో కూలిన నేవీ హెలికాప్టర్.. ఒకరు మృతి ?

‘‘దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం అందిచనుంది. మీ ప్రేమ, ఆశీస్సులు నాకు ఎప్పుడూ పవిత్రమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాయి’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్ గఢ్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. 2020 లో కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (Pradhan Mantri Garib Kalyan Anna Yojana-PMJKAY) పథకాన్ని ప్రవశపెట్టింది. అయితే ఆ పథకాన్ని పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా మరో సారి కూడా కేంద్ర దీనిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని కింద ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఎ కోటాలోని వ్యక్తులకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios