సీఎంలతో మోడీ రేపు వీడియో కాన్పరెన్స్: లాక్‌డౌన్‌పైనే చర్చ

లాక్ డౌన్ ను పురస్కరించుకొని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేమంద్ర మోడీ సోమవారం నాడు మధ్యాహ్నం వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.
 

PM To Meet Chief Ministers Tomorrow At 3 pm To Discuss Lockdown

న్యూఢిల్లీ: లాక్ డౌన్ ను పురస్కరించుకొని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేమంద్ర మోడీ సోమవారం నాడు మధ్యాహ్నం వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.

కరోనా నివారించేందుకు గాను ప్రధాని మోడీ ఈ ఏడాది మార్చి మూడో వారం నుండి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిర్వహిస్తోంది. ఈ లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు నాలుగుసార్లు మోడీ సీఎంలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. సోమవారంనాడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించడం ఐదోసారి అవుతోంది.

also read:ఐదుగురు ఎయిరిండియా పైలెట్లకు కరోనా: క్వారంటైన్‌కి తరలింపు

ఆయా రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ అమలౌతున్న విధానం , భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లు కూడ పాల్గొంటారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్ధికంగా కుదేలౌతున్న తమను ఆదుకోవాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. 

రుణాలను వాయిదా వేయాలని కూడ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. కొన్ని రాష్ట్రాలు ఎప్ఆర్‌బిఎం పరిమితిని కూడ పెంచుకొనేందుకు అనుమతిని ఇవ్వాలని కూడ కోరాయి. ఈ విషయాలను రాష్ట్రాలు ఈ సమావేశంలో లేవనెత్తే అవకాశాలు కూడ లేకపోలేదు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios