జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్నదాడి విషయం తెలియగానే ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైన చర్య అన్న ఆయన.. జవాన్ల త్యాగం వృథా కాదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని తెలిపారు. దాడిలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని అభిలషిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ సంఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. సీఆర్పీఎఫ్ డీజీతో మాట్లాడిన ఆయన తదుపరి చర్యలపై దిశానిర్దేశం చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు హోంమంత్రి రేపు శ్రీనగర్‌కు వెళ్లనున్నారు. 

 

"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు 

జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి