ఇవాళ్టీతో జీఎస్టీకి ఏడాది.. ప్రధాని ఏమన్నారంటే

PM Narendramodi Messege on GST One Year Celebrations
Highlights

ఇవాళ్టీతో జీఎస్టీకి ఏడాది.. ప్రధాని ఏమన్నారంటే

దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ సంస్కరణగా ఆర్ధికవేత్తలు అభివర్ణిస్తున్న జీఎస్టీ అమల్లోకి వచ్చి ఇవాళ్టీతో ఏడాది పూర్తి అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పన్నుల స్థానంలో ఒకే పన్ను విధానం అమల్లో ఉండాలన్న ఉద్దేశ్యంతో పార్లమెంట్ జీఎస్టీ చట్టాన్ని ఆమోదించింది. 2017 జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం దీనిని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చింది. సంవత్సరం కావొస్తున్నా దీనిపై సరైన అవగాహన లేదని ఫీడ్‌బ్యాక్ వస్తున్నప్పటికీ.. ఆదాయపరంగా కేంద్రానికి కాసులు కురిపిస్తోంది.

జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలనుద్దేశిస్తూ ట్వీట్ చేశారు.. జీఎస్టీ వృద్ధిని ప్రొత్సహించింది.. పన్నుల్లో సులభత్వాన్ని.. పారదర్శకతను తీసుకొచ్చింది.. ఆర్థిక అంశాలను వ్యవస్థీకృతం చేసేందుకు... ప్రొడక్టవీటిని పెంచేందుకు.. వాణిజ్యం మరింత సులభంగా నిర్వహించేందుకు జీఎస్టీ సాయపడిందని.. భారత ఆర్ధిక వ్యవస్థలో సానుకూల మార్పులను తీసుకొచ్చిందని ప్రధాని పేర్కొన్నారు.

జీఎస్టీ సంబరాల్లో భాగంగా.. జీఎస్టీ ప్రయోజనాలు అది అమల్లోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక ముఖ చిత్రం ఏ విధంగా మారింది తదితర కార్యక్రమాలు ఇవాళ దేశవ్యాప్తంగా జరగనున్నాయి.
 

loader