Asianet News TeluguAsianet News Telugu

రేపు ఏపీ, తెలంగాణల్లోని బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ (andhra pradesh), తెలంగాణ (telangana) రాష్ట్రాలకు చెందిన బీజేపీ (bjp) ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) బుధవారం భేటీ కానున్నారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో రేపు ఉదయం 9.30 గంటలకు మోడీ సమావేశం కానున్నారు

pm Narendra modi will meet telugu states bjp mps in delhi
Author
New Delhi, First Published Dec 14, 2021, 10:14 PM IST

ఆంధ్రప్రదేశ్‌ (andhra pradesh), తెలంగాణ (telangana) రాష్ట్రాలకు చెందిన బీజేపీ (bjp) ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) బుధవారం భేటీ కానున్నారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో రేపు ఉదయం 9.30 గంటలకు మోడీ సమావేశం కానున్నారు. రేపు ఉదయం అల్పాహార విందుకు తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలను ప్రధాని ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ (lok sabha), రాజ్యసభల్లోని (rajya sabha) బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు.  

ఇకపోతే రెండోరోజు ఉత్తర‌ప్రదేశ్ (uttar pradesh) పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ‌ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుపరిపాలనపై సెమినార్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు, సమస్యలపై ప్రధాని ముఖ్య‌మంత్రుల‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ సహా మరిన్ని అంశాలపై బీజేపీ సీఎంలతో ప్రధాని మోడీ చర్చించారు. ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో మోడీతో సీఎంల భేటీకి ప్రాధాన్యత సంతరించుకొంది.

Also Read:PM Modi: కార్మికులతో కలిసి భోజనం చేసిన ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్..

కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వారణాసిలో (varanasi) రూ.339 కోట్ల వ్య‌యంతో పూర్తిచేసిన కాశీ విశ్వ‌నాథ్ ధామ్ మొద‌టి ద‌శ‌ను ప్రారంభించారు. గంగానదిపై ఉన్న రెండు ఘాట్ లతో పురాతన కాశీ విశ్వనాథ ఆలయాన్నిఈ కారిడర్ కలపనుంది. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌కు (kashi vishwanath dham ) ప్రధాని మోదీ  2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు. దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని  ప్రాజెక్టులో 23 భవనాలను మోదీ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నమామి గంగే విజయాన్ని మనం కొనసాగించాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. మనం లోకల్ ఫర్ వోకల్ కోసం పనిచేయాలని.. పూర్తిగా ఆత్మనిర్భర్ భారత్ గురించి గర్వపడాలని సూచించారు. నేటి భారతదేశం దేవాలయాను పునరుద్దించడమే కాకుండా.. పేదలకు పక్క ఇళ్లను కూడా నిర్మిస్తుందని అన్నారు. వారసత్వం ఉందని.. అభివృద్ది కూడా ఉందని(విరాసత్ భీ హై, వికాస్ భీ హై) వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios