గిరిజనుల సాధికారితకు పీఎం-పీవీటీజీ డెవలప్ మెంట్ మిషన్: ఈ నెల 15న ప్రారంభించనున్న మోడీ

గిరిజనుల సంక్షేమం కోసం  నరేంద్ర మోడీ సర్కార్  మరో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.  గిరిజనులకు  కనీస సౌకర్యాలు కల్పించేందుకు గాను  పీఎం పీవీటీజీ డెవలప్ మెంట్ మిషన్ ను  ప్రారంభించనున్నారు మోడీ.

 PM Narendra Modi will launch PM-PVTG Development Mission in Khunti on November 15 lns

న్యూఢిల్లీ:  గిరిజనుల సాధికారిత  కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్  మరో  కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.  పీఎం-పీవీటీజీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ  ఈ నెల  15న ప్రారంభించనున్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  మోడీ సర్కార్  జన జాతీయ  గౌరవ్ దివస్ సందర్భంగా గిరిజనుల సమగ్ర అభివృద్ది కోసం  రూ. 24 వేల కోట్లతో పీవీటీజీ పథకాన్ని ప్రారంభించింది.2023-24 బడ్జెట్ లో  దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న గిరిజనుల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు  పీవీటీజీ డెవలప్ మెంట్ మిషన్ ను ప్రారంభించనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.

దాదాపు  28 లక్షల జనాభా కలిగిన  22,544 గ్రామాల్లో   75 పీవీటీజీలున్నాయి. అడవుల్లో  నివసించే   గిరిజనులు, ఆదీవాసీల కోసం  సౌకర్యాలను కల్పించాలని  మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  రోడ్డు, టెలికం కనెక్టివిటీ, విద్యుత్, సురక్షితమైన గృహలు,  స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్యం వంటి  సౌకర్యాలను కల్పించనుంది.తొమ్మిది మంత్రిత్వశాఖలు, పీఎంజీఎస్‌వై, పీఎంజీఎవై, జల్ జీవన్ మిషన్  మొదలైన  ఏజెన్సీలతో  సమన్వయం చేసుకుంటూ  గిరిజన ప్రాంతాల్లో  సౌకర్యాలను కల్పించనున్నారు.

పీఎంటీజీతో పాటు   పీఎంజేఎవై, సికిల్ సెల్ డీసీజ్ ఎలిమినేషన్,  టీబీ ఎలిమినేషన్, 100 శాతం ఇమ్యునైజేషన్, పీఎం సురక్షిత్ మాతృత్వ యోజన, పీఎం మాతృవందన యోజన, పీఎం పోషన్, పీఎం జగన్ ధన్ యోజన వంటి కార్యక్రమాలను సంపూర్ణంగా అమలు చేయనున్నారు.

జార్ఖండ్ రాష్ట్రంలోని కుంటి జిల్లాలో పీఎం పీవీటీజీ డెవలప్ మెంట్ మిషన్ ను  ప్రధానమంత్రి మోడీ ప్రారంభిస్తారు.బిర్సాముండా  జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios