Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్‌కు రావాల్సిందే.. చిన్నపిల్లలు చెప్పినట్లు సాకులు చెప్పొద్దు: ఎంపీలకు మోడీ క్లాస్

పార్లమెంట్‌ శీతాకాల (parliament winter session) సమావేశాల సందర్భంగా బీజేపీ (bjp) ఎంపీలకు క్లాస్ పీకారు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) . విపక్షాలు అధికార పార్టీని టార్గెట్‌ చేసి.. గుక్క తిప్పుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో పలువురు బీజేపీ ఎంపీలు, మినిస్టర్లు.. సమావేశాలకు హాజరు కాకపోవడంపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

pm narendra modi warns bjp mps absent and irregular parliament session
Author
New Delhi, First Published Dec 7, 2021, 7:58 PM IST

పార్లమెంట్‌ శీతాకాల (parliament winter session) సమావేశాల సందర్భంగా బీజేపీ (bjp) ఎంపీలకు క్లాస్ పీకారు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) . విపక్షాలు అధికార పార్టీని టార్గెట్‌ చేసి.. గుక్క తిప్పుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో పలువురు బీజేపీ ఎంపీలు, మినిస్టర్లు.. సమావేశాలకు హాజరు కాకపోవడంపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పలువురు బీజేపీ ఎంపీలు మీటింగ్‌లకు, పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావడం లేదని.. ఇది ఇలానే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని ప్రధాని హెచ్చరించినట్లు సమాచారం.

ఎంపీలు, మినిస్టర్లు ప్రవర్తన మార్చుకోకపోతే.. మార్చాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని మోడీ తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. బీజేపీ  ఎంపీలు, మంత్రులు క్రమశిక్షణతో మెలగాలని మోడీ సూచించినట్లుగా సమాచారం. క్రమశిక్షణతో మెలగాలని.. సమయపాలన పాటించాలని.. చిన్న పిల్లల మాదిరి కుంటి సాకులు చెప్పవద్దని ప్రధాని సూచించారట. 

Also Read;డబుల్ ఇంజన్ ప్రభుత్వమే రెట్టింపు వేగంతో పనిచేస్తుంది.. యూపీలో ఎయిమ్స్, ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించిన మోదీ

ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. పార్లమెంట్‌ సమావేశాలకు రావాల్సిందిగా పదే పదే దీని గురించి మీతో చర్చించడం తనకు బాగా అనిపించడం లేదన్నారు. మీరు మారకపోతే.. మార్పులు చేయాల్సి వస్తుంది అని మోడీ హెచ్చరించారట. ఈ సమావేశానికి సీనియర్‌ మంత్రులు అమిత్‌ షా (amit shah), పీయుష్‌ గోయల్‌ (piyush goyal), విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, పార్లమెంటు వ్యవహరాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులు హాజరయ్యారు. 

అంతకుముందు వ్యవసాయ చట్టాలకు (farm laws) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభలో డిమాండ్ చేశారు. మరణించిన రైతుల వివరాలేవీ తమ వద్ద లేవని వ్యవసాయ శాఖ మంత్రి సభలో చెప్పారని రాహుల్ గుర్తుచేశారు. అందుకే ఆ జాబితాను తాము అందజేస్తున్నామని తెలిపారు.  రాహుల్ గాంధీ లోక్‌సభలో (Lok Sabha) మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద డేటా లేనందున.. మరణించిన రైతుల జాబితాను తాను అందజేస్తానని చెప్పారు. ‘సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమంలో 700 మంది రైతులు అమరులయ్యారని దేశానికి తెలుసు. ప్రధాని రైతులకు క్షమాపణలు చెప్పారు. తప్పును అంగీకరించారు. ఉద్యమ సమయంలో అమరులైన రైతుల సంఖ్య గురించి వ్యవసాయ మంత్రిని ప్రశ్నించగా.. వారి వద్ద డేటా లేదని చెప్పారు’ అని రాహుల్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios