రేపు సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్.. లాక్‌డౌన్ ఎత్తేస్తారా, పొడిగిస్తారా: దేశ ప్రజల ఆసక్తి

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి చర్చించనున్నారు. రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

PM Narendra modi to interact with CMs on Monday to discuss way out of lockdown COVID fight

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి చర్చించనున్నారు. రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

కరోనా నియంత్రణతో పాటు లాక్‌డౌన్‌ అమలుపైనా చర్చింనున్నారు. దేశంలో కోవిడ్ 19 వెలుగులోకి వచ్చిన తర్వాత తొలుత మార్చి 20న ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని 24న లాక్‌డౌన్ ప్రకటించారు.

Also Read:ఢిల్లీలో లాక్‌డౌన్ సడలింపులు.. కేవలం వీటికి మాత్రమే: కేజ్రీవాల్ ప్రకటన

ఆ తర్వాత ఏప్రిల్ 11న రెండోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వారి అభ్యర్ధన మేరకు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఈ క్రమంలో రెండో దశ లాక్‌డౌన్ ముగింపునకు గడువు సమీపిస్తుండటంతో దానిపై చర్చించే అవకాశం ఉంది.

లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అంశంపై ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న రాష్టాలు మాత్రం మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరుతున్నాయి.

Also Read:క్యాంపులో వంటవాడికి పాజిటివ్: 14 మంది బీఎస్ఎఫ్ జవాన్లు క్వారంటైన్‌లోకి

కోవిడ్ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే లాక్‌డౌన్ అమలు చేయాలని పలువురు ముఖ్యమంత్రులు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆదివారం మన్‌కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని... ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించాలని చెబుతూనే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రధాని లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా లేక దశలవారీగా ఎత్తేస్తారా అన్నదానిపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios