దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. చివరికి సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలను చూసే జవాన్లను కూడా కోవిడ్ 19 వదలడం లేదు. తాజాగా బీఎస్‌ఎఫ్‌కు చెందిన 14 మంది సైనికులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్ కారణంగా ఆగ్రాలో పోలీసులకు సాయం చేసేందుకు ఈ 14 మంది జవాన్లు విధులు నిర్వర్తించారు. వీరికి బస కోసం అక్కడ ప్రత్యేకంగా క్యాంపు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

Also Read:ఢిల్లీలో లాక్‌డౌన్ సడలింపులు.. కేవలం వీటికి మాత్రమే: కేజ్రీవాల్ ప్రకటన

అయితే అక్కడ వంటగదిలో పనిచేసిన ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలడంతో తీవ్ర కలకలం రేగింది. వీరు శనివారం సాయంత్రం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్ పట్టణానికి చేరుకున్న జవాన్లకు అక్కడి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

వీరి నమూనాలను సేకరించి క్వారంటైన్‌కు తరలించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జవాన్లకు కరోనా లక్షణాలు లేవని స్పష్టం చేశారు. వీరంతా ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో పాల్గొంటున్నారు.

Also Read:పరిమితమైన సడలింపులతో లాక్ డౌన్ కొనసాగింపుకు రాష్ట్రాల మొగ్గు?

మరోవైపు భారత సైన్యానికి కరోనా సోకకుండా కేంద్ర ప్రభుత్వం, అధికారులు  ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయినప్పటికీ నౌకాదళంలో 25 మందికి, ఆర్మీలో  ఎనిమిది మంది జవాన్లకు కోవిడ్ 19 సోకిన సంగతి తెలిసిందే. వీరంతా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారు..