Asianet News TeluguAsianet News Telugu

Army Helicopter Crash : కాసేపట్లో మోడీ అధ్యక్షతన భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదం నేపథ్యంలో బుధవారం సాయత్రం 6.30 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది

PM Narendra modi to head CCS meet over Army Helicopter Crash
Author
New Delhi, First Published Dec 8, 2021, 5:49 PM IST

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదం నేపథ్యంలో బుధవారం సాయత్రం 6.30 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రధాని నివాసంలో జరిగే ఈ భేటీకి హోమ్, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్ధిక శాఖ మంత్రులు హాజరుకానున్నారు. మరోవైపు ఆర్మీ హెలికాఫ్టర్ (Army Helicopter Crash ) కుప్పకూలిన ఘటనలో 13 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. 

ప్రమాదం తర్వాత చెల్లాచెదురుగా పడివున్న శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇదే ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (Bipin Rawat ) సతీమణి మధులికా (madhulika rawat) కూడా మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో వున్న జనరల్ బిపిన్ రావత్‌ పరిస్ధితి అత్యంత విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ముగ్గురు వైద్యుల బృందం చికిత్సను అందిస్తోంది. ఈ హెలికాఫ్టర్‌లో ఐదుగురు సిబ్బంది, రావత్ కుటుంబసభ్యులు, ఆర్మీ అధికారులు వున్నారు. 

ALso REad:Army Chopper Crash : ప్రమాదంలో 13 మంది మృతి, ఒకరే ఒకరు, రావత్ కి చికిత్సపై గోప్యత

కాగా.. ఆర్మీ హెలికాప్టర్‌ కూలిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రకటన చేయనుంది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (rajnath singh) రేపు పార్లమెంట్‌లో ఈ మేరకు ప్రకటన చేస్తారని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతర పరిస్థితులను రాజ్‌నాథ్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ (union cabinet) అత్యవసర సమావేశంలో ప్రధాని మోడీకి వివరాలు తెలియజేసిన ఆయన.. కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని రావత్‌ నివాసానికి కూడా వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. 

తమిళనాడు (tamilnadu) రాష్ట్రం కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో బుధవారం ఈ చాపర్ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి మొత్తం 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే కుప్పకూలినట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios