Asianet News TeluguAsianet News Telugu

Army Chopper Crash : ప్రమాదంలో 13 మంది మృతి, ఒకరే ఒకరు, రావత్ కి చికిత్సపై గోప్యత

ఆర్మీ హెలికాఫ్టర్ (Army Helicopter Crash ) కుప్పకూలిన ఘటనలో 13 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదం తర్వాత చెల్లాచెదురుగా పడివున్న శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

13 dead as chopper with CDS Bipin Rawat on board crashes in Tamil Nadu
Author
Chennai, First Published Dec 8, 2021, 5:14 PM IST

ఆర్మీ హెలికాఫ్టర్ (Army Helicopter Crash ) కుప్పకూలిన ఘటనలో 13 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదం తర్వాత చెల్లాచెదురుగా పడివున్న శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇదే ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (Bipin Rawat ) సతీమణి మధులికా (madhulika rawat) కూడా మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో వున్న జనరల్ బిపిన్ రావత్‌ పరిస్ధితి అత్యంత విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ముగ్గురు వైద్యుల బృందం చికిత్సను అందిస్తోంది. ఈ హెలికాఫ్టర్‌లో ఐదుగురు సిబ్బంది, రావత్ కుటుంబసభ్యులు, ఆర్మీ అధికారులు వున్నారు. 

మరోవైపు ఆర్మీ హెలికాప్టర్‌ కూలిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రకటన చేయనుంది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (rajnath singh) రేపు పార్లమెంట్‌లో ఈ మేరకు ప్రకటన చేస్తారని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతర పరిస్థితులను రాజ్‌నాథ్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ (union cabinet) అత్యవసర సమావేశంలో ప్రధాని మోడీకి వివరాలు తెలియజేసిన ఆయన.. కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని రావత్‌ నివాసానికి కూడా వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సాయంత్రం రాజ్‌నాథ్ సింగ్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

Also Read:CDS Gen Bipin Rawat: బిపిన్ రావ‌త్ ప్ర‌యాణించిన Mi-17V-5 హెలికాప్టర్ ప్రత్యేకత‌లివే..!

కాగా.. భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా బిపిన్ రావత్ 2019, జ‌న‌వ‌రిలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. త్రివిధ దళాల (వాయుసే, ఆర్మీ, నౌకాద‌ళం) తొలి అధిపతిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన బిపిన్ రావ‌త్ మూడేళ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఇక ఆయ‌న ప‌ద‌వీకాలం 2022, జ‌న‌వ‌రితో ముగియ‌నుంది. అంత‌లోనే ఈ దుర్ఘటనన జ‌ర‌గ‌డంతో భారత సాయుధ దళాలు ఉలిక్కిపడ్డాయి.  గతంలో మూడేళ్లపాటు ఆర్మీ చీఫ్‌గా పని చేసిన బిపిన్ రావత్.. 2019, జ‌న‌వ‌రిలో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అంతకు ముందే ఆయన్ను దేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

త్రివిధ దళాలకు చెందిన చిహ్నాలను ఆయన యూనిఫాం మీద పొందుపరిచారు. మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తూ... రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్‌గా సీడీఎస్ వ్యవహరిస్తున్నారు. అంతేకాదు మనదేశంలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి ఆయనే.. లఢఖ్ సంక్షోభ సమయంలో బిపిన్ రావత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. అంతేకాదు భారత రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు రావత్ మార్గదర్శి.. దేశంలో త్రివిధ దళాలకు వేర్వేరు చోట్ల వున్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే అత్యంత కీలకమైన బాధ్యత ఆయనదే. 

Follow Us:
Download App:
  • android
  • ios