మోడీకి లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డ్.. ఎల్లుండి పుణేలో అందుకోనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 1న మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా లోకమాన్య తిలక్ జాతీయ అవార్డ్‌ను మోడీ స్వీకరిస్తారు. దేశ అభివృద్ధి, ప్రగతికి విశేష కృషి చేసిన వ్యక్తలకు అవార్డ్‌ను అందిస్తారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 1న మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పుణే నగరంలోని దగదుషేత్ వినాయక ఆలయాన్ని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జరిగే కార్యక్రమంలో లోకమాన్య తిలక్ జాతీయ అవార్డ్‌ను మోడీ స్వీకరిస్తారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని పలు మెట్రో రైళ్లను కూడా ప్రారంభిస్తారని పీఎంవో తెలిపింది. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని పేర్కొంది. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. పీఎంఏవై కింద నిర్మించిన 1,280 ఇళ్లను మోడీ లబ్దిదారులకు ఇవ్వనున్నారు.
Aso Read : ప్రకృతి వైపరీత్యాలపై మోడీ ఆందోళన:103 మన్ కీ బాత్ లో మోడీ
భారత స్వాతంత్య్ర సమరయోధులు లోక్‌మాన్య బాలగంగాధర తిలక్ వర్ధంతి సందర్భంగా ఏటా ఆగస్ట్ 1న జరిగే కార్మక్రమంలో పలువురు ప్రముఖులకు లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డ్‌ను తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ప్రదానం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా దేశ అభివృద్ధి, ప్రగతికి విశేష కృషి చేసిన వ్యక్తలకు అవార్డ్‌ను అందిస్తారు. గతంలో డాక్టర్ శంకర్ దయాల్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్‌పేయ్, ఇందిరా గాంధీ, ఎన్ఆర్ నారాయణ మూర్తి వంటి దిగ్గజాలకు ఈ అవార్డ్‌ను అందజేశారు. ఈ లిస్ట్‌లో ప్రధాన మోడీ 41వ వ్యక్తి.