ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లుగా అన్నంత పనిచేశారు. సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్లుగా ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే సోషల్ మీడియా నుంచి సైన్ ఆఫ్ అవుతున్నానని మోడీ ట్వీట్ చేశారు. ఈ రోజంతా ఏడుగురు మహిళలు వారి విజయగాథలను షేర్ చేస్తారని, అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

 

సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రధాని మోడీ గత సోమవారం ట్వీట్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను ఎందుకు వదిలేస్తున్నానో కూడా కారణం తెలిపారు.

Also Read:కోట్లాది మంది ఫాలోవర్స్‌కు షాక్: సోషల్ మీడియా నుంచి తప్పుకోనున్న మోడీ..?

ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజు తన సోషల్ మీడియా ఖాతాలను వదిలేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ‘‘ ఆదివారం రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్న మహిళలకు తన సోషల్ మీడియా అకౌంట్లను వదిలేస్తున్నానని, అలా చేయడం వల్ల లక్షలాది మందిని ఉత్సాహపరిచినట్లు అవుతుందన్నారు.

Also Read:ప్రధాని సోషల్ మీడియాను వదలద్దంటున్న నెటిజన్లు

అయితే మోడీ నిర్ణయం పట్ల కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. దేశంలో రగులుతున్న పలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే ప్రధాని ఈ ఎత్తుగడ వేశారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ట్వీట్ చేశారు. మోడీ సోషల్ మీడియాను కాకుండా విద్వేషాన్ని వదిలేయాలని రాహుల్ గాంధీ ట్వీట్  చేసిన సంగతి తెలిసిందే.