Asianet News TeluguAsianet News Telugu

కోట్లాది మంది ఫాలోవర్స్‌కు షాక్: సోషల్ మీడియా నుంచి తప్పుకోనున్న మోడీ..?

వచ్చే ఆదివారం నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల నుంచి ఆయన వైదొలగనున్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ వార్త సైతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. 
 
pm narendra modi may quit from social media
Author
New Delhi, First Published Mar 2, 2020, 9:29 PM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కలిపి గతేడాది మే 7 నాటికి 11,09,12,648 మంది ఫాలోవర్స్ ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది.

పార్టీ కార్యక్రమాలతో పాటు దేశంలోని సమకాలీన అంశాలపై మోడీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. అటువంటి మోడీ సోషల్ మీడియాకు దూరమయ్యేలా పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

వచ్చే ఆదివారం నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల నుంచి ఆయన వైదొలగనున్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ వార్త సైతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios