Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ఎన్టీఆర్ పేరును ప్రస్తావించిన ప్రధాని మోడీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు,దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను కూడా మోడీ ప్రశంసించారు.
 

pm narendra modi remember late ap cm ntr at bjp national executive meeting
Author
First Published Jan 17, 2023, 9:41 PM IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు,దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. నిత్యం ప్రజలతో మమేకమై ఎన్టీఆర్ ముందడుగు వేశారని ఆయన ప్రశంసించారు. ప్రజాక్షేత్రంలో కింది స్థాయిలో పోరాడి అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని మోడీ అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను కూడా మోడీ ప్రశంసించారు. మనదేశానికి అత్యుత్తమ శకం రాబోతోందన్నారు. 

ALso Read: బంగారు తెలంగాణ తెచ్చేది మేమే: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

ఇకపోతే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పార్టీ పొడిగించింది. 2024 జూన్ వరకు ఆయన పదవిలో వుండనున్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించినట్లుగా తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ తదితర రాష్ట్రాల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. బంగారు తెలంగాణను తెచ్చేది తమ పార్టీయేనని   కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  చెప్పారు. జేపీ నడ్డా నేతృత్వంలో   తెలంగాణతో పాటు బెంగాల్ రాష్ట్రంలో  బీజేపీ  బలమైన శక్తిగా అవతరించిందని  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశంలో  తీసుకున్న నిర్ణయాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  మంగళవారంనాడు మీడియాకు వివరించారు. జేపీ నడ్డా నేతృత్వంలో  పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో  బలమైన శక్తిగా  అవతరించిందన్నారు.  మోడీ, నడ్డా నేతృత్వంలో  2024 లో కేంద్రంలో మరోసారి  విజయం సాధిస్తామని అమిత్ షా విశ్వాసం వ్యక్తం  చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios