Asianet News TeluguAsianet News Telugu

బంగారు తెలంగాణ తెచ్చేది మేమే: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

2024 ఎన్నికల్లో  కేంద్రంలో  మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమాను వ్యక్తం  చేశారు.  మోడీ, జేపీ నడ్డా నేతృత్వంలో  పార్టీ  విజయతీరాలకు  చేరుతుందన్నారు. 

BJP Retain power  in  2024 Elections  : union Minister  Amit Shah
Author
First Published Jan 17, 2023, 4:35 PM IST

న్యూఢిల్లీ: బంగారు తెలంగాణను తెచ్చేది తమ పార్టీయేనని   కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  చెప్పారు. జేపీ నడ్డా నేతృత్వంలో   తెలంగాణతో పాటు బెంగాల్ రాష్ట్రంలో  బీజేపీ  బలమైన శక్తిగా అవతరించిందని  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశంలో  తీసుకున్న నిర్ణయాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  మంగళవారంనాడు మీడియాకు వివరించారు. జేపీ నడ్డా నేతృత్వంలో  పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో  బలమైన శక్తిగా  అవతరించిందన్నారు.  మోడీ, నడ్డా నేతృత్వంలో  2024 లో కేంద్రంలో మరోసారి  విజయం సాధిస్తామని అమిత్ షా విశ్వాసం వ్యక్తం  చేశారు. 

జేపీ నడ్డా నాయకత్వంలో  కరోనా సమయంలో  బీజేపీ కార్యకర్తలు ఆదర్శప్రాయమైన పనిచేశారన్నారు. జేపీ నడ్డా నేతృత్వంలో  అనేక రాష్ట్రాల్లో  తమ పార్టీ మంచి పనితీరును కనబర్చిందన్నారు.  ఈశాన్య రాష్ట్రాలతో  పాటు  దేశంలో  తమ పార్టీని మరింత బలోపేతం చేసిన విషయాన్ని  అమిత్ షా గుర్తు  చేశారుబీజేపీ జాతీయ అద్యక్షపదవిలో ఉన్న జేపీ నడ్డా పదవిని  2024 జూన్ వరకు  పొడిగిస్తూ  జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసిన విషయాన్ని అమిత్ షా చెప్పారు.  ఈ తీర్మానాన్ని కేంద్ర రక్షణ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించినట్టుగా అమిత్ షా వివరించారు. 

నిన్న, ఇవాళ  బీజేపీ  జాతీయ కార్యవర్గసమావేశాలు  న్యూఢిల్లీలో జరిగాయి.  రానున్న రోజుల్లో తొమ్మిది రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించారు.  నిన్న సాయంత్రం నాలుగు గంటలకు  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు  మోడీ హాజరయ్యారు.  గుజరాత్ లో  పార్టీ భారీ విజయం సాధించడంతో  జాతీయ కార్యవర్గ సమావేశాలకు  రోడ్ షో ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ  మోడీ హాజరయ్యారు.  నిన్న రాత్రి జాతీయ కార్యవర్గసమావేశాలు పూర్తయ్యేవరకు  మోడీ ఉన్నారు. ఇవాళ ఉదయమే  పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు  మోడీ హాజరయ్యారు. 

also read:బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు.. ఎప్పటి వరకంటే..?

నిన్న ఉదయం  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ప్రజాసంగ్రామ యాత్రకు  సంబంధించి  ప్రజెంటేషన్ చేశారు.  ఇదే తరహలో  అన్ని రాష్ట్రాల్లో కూడా  యాత్రలు చేయాలని ప్రధాని మోడీ సూచించారు తెలంగాణలో యాత్ర  నిర్వహించిన తీరు తెన్నులు, యాత్రకు  కలిగిన అడ్డంకులను బండి సంజయ్  ఈ సందర్భంగా వివరించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios