గత కొన్ని రోజుల నుంచి యూపీలో పర్యటించిన ప్రధాని మోడీ.. ఈ రోజు గోవాలో పర్యటించారు. ఆదివారం జరిగిన గోవా లిబ‌రేష‌న్ డే ఉత్సవాల్లో (goa liberation day) ప్రధాని పాల్గొన్నారు. గోవాలోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖ‌ర్జి స్టేడియంలో గోవా విమోచన దినోత్సవ (గోవా లిబ‌రేష‌న్ డే ) వేడుకలు జ‌రుగుతున్నాయి

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై (five state elections) ప్రధాన మంత్రి నరేంద్రమోడీ (Narendra modi) దృష్టి సారించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని ఆయన సంకల్పించారు. గత కొన్ని రోజుల నుంచి యూపీలో పర్యటించిన ప్రధాని మోడీ.. ఈ రోజు గోవాలో పర్యటించారు. ఆదివారం జరిగిన గోవా లిబ‌రేష‌న్ డే ఉత్సవాల్లో (goa liberation day) ప్రధాని పాల్గొన్నారు. 

గోవాలోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖ‌ర్జి స్టేడియంలో గోవా విమోచన దినోత్సవ (గోవా లిబ‌రేష‌న్ డే ) వేడుకలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా భార‌త భూభాగాలైన‌ గోవా, డామ‌న్ అండ్‌ డ‌య్యూ ప్రాంతాల విముక్తి కోసం పోరాడిన వారిని, 1961లో ఆప‌రేష‌న్ విజ‌య్‌లో (operation vijay) పాల్గొన్నవారిని ప్రధాని మోడీ స‌త్కరించారు. ఆపరేషన్ విజయ్ అమరవీరులకు నివాళులు అర్పించారు. అంతకుముందు స్టేడియానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (pramod sawant) స్వాగతం పలికారు. 

కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వారణాసిలో రూ.339 కోట్ల వ్య‌యంతో పూర్తిచేసిన కాశీ విశ్వ‌నాథ్ ధామ్ (kashi vishwanath dham) మొద‌టి ద‌శ‌ను ప్రారంభించారు. గంగానదిపై ఉన్న రెండు ఘాట్ లతో పురాతన కాశీ విశ్వనాథ ఆలయాన్నిఈ కారిడర్ కలపనుంది. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌కు ప్రధాని మోదీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు. దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్రాజెక్టులో 23 భవనాలను మోదీ ప్రారంభించారు. 

Also read:వారణాసిలో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటన.. కాసేపట్లో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో భేటీ

ఈ సందర్భగా మోదీ మాట్లాడుతూ.. నమామి గంగే విజయాన్ని మనం కొనసాగించాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. మనం లోకల్ ఫర్ వోకల్ కోసం పనిచేయాలని.. పూర్తిగా ఆత్మనిర్భర్ భారత్ గురించి గర్వపడాలని సూచించారు. నేటి భారతదేశం దేవాలయాను పునరుద్దించడమే కాకుండా.. పేదలకు పక్క ఇళ్లను కూడా నిర్మిస్తుందని అన్నారు. వారసత్వం ఉందని.. అభివృద్ది కూడా ఉందని(విరాసత్ భీ హై, వికాస్ భీ హై) వ్యాఖ్యానించారు. 

"