ఉత్తరప్రదేశ్‌లో (uttar pradesh) ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) రెండవ రోజు పర్యటిస్తున్నారు. వారణాసి (varanasi) పర్యటనలో భాగంగా నిన్న కాశీ విశ్వనాథ్ ధామ్ (kashi vishwanath dham) ప్రారంభించిన ప్రధాని మోడీ.. రెండో రోజైన మంగళవారం పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో (uttar pradesh) ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) రెండవ రోజు పర్యటిస్తున్నారు. వారణాసి (varanasi) పర్యటనలో భాగంగా నిన్న కాశీ విశ్వనాథ్ ధామ్ (kashi vishwanath dham) ప్రారంభించిన ప్రధాని మోడీ.. రెండో రోజైన మంగళవారం పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. బీజేపీ (bjp) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పాలన సంబంధిత విషయాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం వుంది. అలాగే, ఈరోజు సద్గురు సదాఫల్దియో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకలో ప్రధాని పాల్గొననున్నారు.
పీఎం వర్గాల సమచారం ప్రకారం.. వారణాసిలోని మధ్యాహ్నం 3:30 గంటలకు స్వర్వేద్ మహామందిర్‌లో సద్గురు సదాఫల్దీయో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని మోడీ హాజరవుతారు. అనంతరం అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో ప్రధాని సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి బీహార్, నాగాలాండ్ డిప్యూటీ సీఎంలు కూడా హాజరుకానున్నారు.
ALso Read:PM Modi: కార్మికులతో కలిసి భోజనం చేసిన ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్..
కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వారణాసిలో రూ.339 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన కాశీ విశ్వనాథ్ ధామ్ మొదటి దశను ప్రారంభించారు. గంగానదిపై ఉన్న రెండు ఘాట్ లతో పురాతన కాశీ విశ్వనాథ ఆలయాన్నిఈ కారిడర్ కలపనుంది. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌కు ప్రధాని మోదీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు. దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్రాజెక్టులో 23 భవనాలను మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భగా మోదీ మాట్లాడుతూ.. నమామి గంగే విజయాన్ని మనం కొనసాగించాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. మనం లోకల్ ఫర్ వోకల్ కోసం పనిచేయాలని.. పూర్తిగా ఆత్మనిర్భర్ భారత్ గురించి గర్వపడాలని సూచించారు. నేటి భారతదేశం దేవాలయాను పునరుద్దించడమే కాకుండా.. పేదలకు పక్క ఇళ్లను కూడా నిర్మిస్తుందని అన్నారు. వారసత్వం ఉందని.. అభివృద్ది కూడా ఉందని(విరాసత్ భీ హై, వికాస్ భీ హై) వ్యాఖ్యానించారు.
